BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని మోడీని అధికారంలోకి దించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీ 543 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 400 ఎంపీ స్థానాలను గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దానిని సాధించేందుకు ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు పార్టీ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.
Karnataka: బెంగళూర్‌లోని కర్ణాటక అసెంబ్లీ ముందు 8మంది కుటుంబ సభ్యులు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు అప్పు తీర్చనందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో బాధలో ఆ కుటుంబ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది.
Congress: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు కాంగ్రెస్ వెళ్తుందా..? లేదా..? అనే సందేహాలకు తెరపడింది. ఈ కార్యక్రమానికి తాము హాజరయ్యేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రామ మందిర వేడుక పూర్తిగా ఆర్ఎస్ఎస్, బీజేపీల కార్యక్రమంగా ఉందని ఆరోపించింది. జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది.
Maldives Row: భారత్-మాల్దీవుల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగింది. ఆ దేశ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేయడంపై భారతీయులు భగ్గుమన్నారు. ఇటీవల ప్రధాని లక్షద్వీప్ వెళ్లిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాల్దీవుల మంత్రులు వివాదాస్పద పోస్టులను పెట్టారు. దీంతో చాలా మంది భారతీయ పర్యాటకులు మాల్దీవ్స్ యాత్రల్ని రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే 10 వేల హోటల్ బుకింగ్స్‌తో పాటు ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
Heart Attack: ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో యుక్తవయసులో పలువురు వ్యక్తులు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. చివరకు చిన్న పిల్లల్ని కూడా హార్ట్ ఎటాక్ కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. డ్రాన్సులు, జిమ్ సెంటర్లలో ఉన్నట్లుండి ఇలా గుండెపోటుకు గురైన పలు సందర్భాలను మనం చూస్తున్నాం. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ మైదానంలోనే మరణించడం విషాదాన్ని నింపింది.
High Court: టీనేజ్‌లో అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాధితురాలకి కోర్టు ఉపశమనం కలిగించింది. అత్యాచారా బాధితురాలు తన 8 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణపై వెనక్కి తగ్గబోమని, దీనిపై అఫిడవిట్ సమర్పించాలని బాధితురాలి తండ్రిని కోర్టు ఆదేశించింది. తన గర్భాన్ని రద్దు చేయాలంటూ మైనర్ సర్వైవర్ చేసిన పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది.
PM Modi: గుజరాత్ గాంధీనగర్‌లో జరిగబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. గుజరాత్లో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. రాబోయే ఏళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.
Lottery: అమెరికాలో ఓ వృద్ధ జంట అసలైన జీనియస్లని చెప్పొచ్చు. ఏకంగా 26 మిలియన్ డాలర్లు( రూ. 200 కోట్లు)లను లాటరీల్లో సంపాదించింది. ఇతంతా వారి అదృష్టం అంటే మీరు పప్పులో కాలేసిటనట్లే, వీరికి ఉన్న అపారమైన గణిత విద్యను, మ్యాథ్స్ ట్రిక్స్ ఉపయోగించి ఈ లాటరీలను సొంతం చేసుకున్నారు. మిషిగాన్ లోని ఎవర్ట్ ప్రాంతంలోని జెర్రీ, మార్జ్ సెల్బీ జంట ఒక స్టోర్ నిర్వహిస్తుండేవారు. ఈ క్రమంలో 60 ఏళ్లు దాటిన తర్వాత వీరు రిటైరై విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరికి ప్రస్తుతం 80,…
PM Modi: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ప్రతిపక్ష బీఎన్పీ పార్టీలో పాటు ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో షేక్ హసీనాకు తిరుగు లేకుండా పోయింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ప్రధాని కాబోతున్నారు.
India-Maldives row: భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో భారత వ్యాపార సంఘమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) మాల్దీవులతో వ్యాపారం చేయడం మానుకోవాలని కోరింది. ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం లేదని వ్యాపార వర్గాలు అన్నాయి. మాల్దీవుల చర్యలకు వ్యతిరేకంగా ఈ బహిష్కరణకు పిలుపునిచ్చింది.