Ram Temple Event: అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి తాను హాజరుకాబోవడం లేదని గతంలో పూరీ శంకరాచార్య చెప్పారు. ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని అన్నారు. రామాలయంపై రాజకీయం చేస్తున్నారని పూరీలోని గోవర్థన మఠం పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి తాను దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయనతో జతకలిశారు ఉత్తరాఖండ్ జోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి.
Google: 2022 చివర్లో ప్రారంభమైన టెక్ లేఆఫ్స్ 2024లో కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం వల్ల వేలాది మంది ఉద్యోగులను ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు తొలగించాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్ ప్రపంచంలోకి శరవేగంగా దూసుకురావడం కూడా ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.
Nayanthara: నటి నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన సినిమా ‘అన్నపూరణి’ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రైట్ వింగ్ సంస్థ ఫిర్యాదు మేరకు నయనతారతో పాటు దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ మరియు ఆర్ రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది.
Indian Passport: అత్యంత పవర్ ఫుల్ పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. భారత పాస్పోర్టుతో 62 దేశాలకు వీసాఫ్రీ ఎంట్రీ ఉంది. ఈ నివేదికను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ వెల్లడించింది. Read Also: Mehbooba Mufti: కాశ్మీర్ నేత మహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు: *అంగోలా *బార్బడోస్ *భూటాన్ *బొలీవియా […]
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ పార్టీ అధినేత మహబూబా ముఫ్తీ తృటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. గురువారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన అనంత్‌నాగ్ జిల్లాలోని సంగమ్ వద్ద జరిగింది. ఎదురుగా వస్తు్న్న కారును, ముఫ్తీ ప్రయాణిస్తున్న స్కార్పియో ఢీకొట్టింది.
Indore: దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మరోసారి ఇండోర్ నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 అవార్డుల్లో భాగంగా ఏడోసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. ఇండోర్, సూరత్ నగరాలు దేశంలో పరిశుభ్రమైన నగరాలుగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.
Rajnath Singh: చైనాను ఉద్దేశించి భారత్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాలో మాట్లాడుతూ.. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్ ఏంటో చైనాకు అర్థమైందని అన్నారు. భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉందని, బలహీనమైన దేశం కాదని చెప్పారు. భారత దేశాన్ని ఎవరూ భయపెట్టి తప్పించుకోలేరని అన్నారు.
Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అయోధ్యతో పాటు యూపీ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులు ఈ వేడులకు అతిథులుగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Earthquake: ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది. ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.
Karnataka: కర్ణాటకలో మతాంతర జంటలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల బెళగావిలో ఇటీవల ఇలాగే ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతితో కలిసి ఉండగా.. మైనారిటీ వర్గానికి చెందిన 10 మందికి పైగా వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఎందుకు అమ్మాయితో కలిసి ఉన్నావంటూ ఓ గదికి తీసుకెళ్లి చితకబాదారు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.