Female Teacher: అమెరికాలో ఇటీవల కాలంలో మహిళా టీచర్లు వారి విద్యార్థులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటి ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. చదువు చెప్పాల్సిన టీచర్లు, మైనర్ విద్యార్థులతో సెక్స్ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తోటి విద్యార్థి వీరి సంబంధాన్ని బయటపెట్టాడు.
Honour Killing: తమిళనాడులో దారుణం జరిగింది. తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని కుటుంబసభ్యులు హత్య చేశారు. ఈ ఘటన తంజావూరులో జరిగింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్న 19 ఏళ్ల యువతిని హత్య చేశారని, యువతి కుటుంబ బంధువలు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Red Ant Chutney: "ఎర్ర చీమల పచ్చడి" గిరిజనులకు ఎంతో ముఖ్యమైన వంటకం. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఉంటుంది. నాగరికతకు అలవాటు పడిన మనకు ఇది కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. అయితే, ఒడిశాలోని ‘ఎర్ర చీమల పచ్చడి’కి భౌగోళిక గుర్తింపు(GI ట్యాగ్) లభించింది. ఈ వంటకంలో అనేక పోషక విలువలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
బీహార్ రాష్ట్రంలో ట్రిపుల్ మర్డర్ కేసు సంచలనంగా మారింది. తమను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు యువతి తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్యకు ఆమె సోదరుడు సహకరించాడు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో భార్యభర్తలను, వారి రెండేళ్ల చిన్నారిని యువతి తండ్రి, అన్న కలిసి హత్య చేశారు.
అయోధ్యలో శ్రీరామ ఆలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతున్నాయి. ఈ నెల 22న రామాలయ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు మొత్తం 7000 మందికి పైగా ముఖ్య అతిథులు హాజరవుతున్నారు. లాల్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
Jeddah Tower: మనం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఏదంటే, టక్కున గుర్తుకు వచ్చేది దుబాయ్‌లోని ‘బుర్జ్ ఖలిఫా’. అయితే త్వరలో ఇది మారబోతోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద టవర్గా సౌదీ అరేబియాలోని ‘జెడ్డా టవర్’ నిలవబోతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలోని ఓబుర్ ఉత్తర భాగంలో జెడ్డా ఎకనామిక్ సిటీ (JEC)లో ఈ ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. గతంలో దీన్ని కింగ్డమ్ టవర్గా పిలిచేవారు. దీనిని ప్రముఖ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ రూపొందించారు. గతంలో బుర్జ్ ఖలిఫాను డిజైన్ చేసింది కూడా ఇతనే.
Shweta K Sugathan: భారతదేశ గణతంత్ర వేడుకుల పరేడ్ చరిత్రంలోనే తొలిసారిగా ఢిల్లీ పోలీస్ బృందంలో మొత్తం మహిళా అధికారులు ఉండబోతున్నారు. నార్త్ డిస్ట్రిక్ట్, పోలీస్-II అడిషనల్ డిప్యూటీ కమీషనర్ అయిన ఐపీఎస్ అధికారి శ్వేతా కే సుగతన్ ఈ పరేడ్‌ని నాయకత్వం వహించనున్నారు. 75వ రిపబ్లిక్ డే పరేడ్కి ఓ మహిళా అధికారి ఇలా నేతృత్వం వహించనున్నారు.
Passport Index: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి.
Article 370: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ‘ఆర్టికల్ 370’ని బీజేపీ నేతృత్వంలోని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మళ్లీ సుప్రీంకోర్టులో ‘రివ్యూ పిటిషన్’ దాఖలైంది.