Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి చెందిన ఫామ్ హౌజ్ లోకి ఇద్దరు అపరిచిత వ్యక్తులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసుల వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ముంబై సమీపంలోని పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. జనవరి 4న ఈ ఘటన జరిగింది. నిందితులను అజేష్ కుమార్ ఓంప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్‌సింగ్ సిఖ్‌లు గుర్తించారు.
Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం మొత్తం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ముఖ్య అతిథులతో పాటు సాధువులు మొత్తం 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. మరోవైపు కోట్లాది మంది ప్రజలు పరోక్షంగా వీక్షించనున్నారు.
Alcohol: సాధారణంగా ఆల్కాహాల్ తాగితే మత్తులో మంచి నిద్ర వస్తుందని అందరు అనుకుంటారు. అయితే అది నిజం కాదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆల్కహాల్‌ని వదులుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుందని కీలక అధ్యయనంలో వెల్లడైంది. సాయంత్రం పూట ఒకటి లేదా రెండు మద్యపానీయాలను తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తు్న్నాయి. సాధారణంగా మద్యపానం తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపోవడానికి సాయపడొచ్చని కానీ ఇది రాత్రంత నిద్రా భంగానికి కారణమవుతుందని తెలిపింది.
Iran: ఇస్లామిక్ దేశం ఇరాన్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలుసు. అక్కడ హత్యలకు పాల్పడిని, మోసం చేసినా, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి వాటికి మరణశిక్షలు విధిస్తుంటారు. ఇక స్త్రీలు మత పద్ధతులు ఉల్లంఘించినా, హిజాబ్ ధరించకపోయిన శిక్షలు కఠినంగా ఉంటాయి. హిజాబ్ ధరించని కారణంగా అక్కడి మోరాలిటీ పోలిసింగ్ దాడుల్లో 2022లో మహ్సా అమిని అనే యువతిని కొట్టి చంపేశారు. ఈ వివాదం అక్కడ మహిళల్లో, యువతలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. పెద్ద ఎత్తున ఉద్యమం ఎగిసిపడింది.
Kargil Night Landing: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గిల్ ప్రాంతంలోని ఎయిర్ స్ట్రిప్‌పై భారీ రవాణా విమానం C130-Jని రాత్రి సమయంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. లడఖ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్ చేయడం ఇదే మొదటిసారి. యూఎస్ లాక్డీడ్ మార్టిన్ తయారు చేసిన C-130J సూపర్ హెర్క్యూలస్ విమానాన్ని సరుకులు, సైనికులు రవాణాతో పాటు కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వాడుతోంది.
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రతిపక్షాల ఎన్నికల బహిష్కరణ నడుము 40 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా వరసగా నాలుగోసారి అధికారంలోకి రావడం దాదాపుగా ఖాయమైంది. ప్రధాన ప్రతిపక్షమై బీఎన్పీ దాని మిత్రపక్షాలు పోలీటో పాల్గొనలేదు. ఆదివారం జరిగిన ఓటింగ్‌లో ఓటేసేందుకు చాలా తక్కువ మంది వచ్చారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
Delhi Crime: ఢిల్లీలో దారుణం జరిగింది. సదర్ బజార్ ప్రాంతంలో ఓ మహిళ 12 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి, నలుగురు వ్యక్తులతో అత్యాచారం చేయించింది. ఓ టీ సెల్లర్తో పాటు ముగ్గురు మైనర్లతో సహా మొత్తం ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఓల్డ్ ఢిల్లీలోని సదర్ బజార్ లోని ఓ వ్యక్తి టీస్టార్‌లో సదరు మహిళ కస్టమర్ అని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన మైనర్ల వయసు 12, 14, 15 ఏళ్లు అని వీరంతా టీ స్టాల్లో పనిచేస్తునట్లు…
Hardik Pandya: ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులను సందర్శించారు. అక్కడ ఉన్న సుందరమైన బీచుల్లో ఆయన పర్యటించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. లక్షదీవుల్లో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అక్కడికి వెళ్లారు.
Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో బీజేపీ ఎన్నికల మోడ్‌లోకి వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్రమోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 13 నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ లోని బెట్టియా నగరంలోని రామన్ మైదాన్‌లో ఆయన బహిరంగ సభకు హాజరుకాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలోనే ప్రధాని బీహార్ లోని రోడ్లు, వంతెనలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.