High Court: అత్యాచార బాధితురాలు 8 నెలల ప్రెగ్నెన్సీ తొలగించుకునేందు కోర్టు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: టీనేజ్‌లో అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాధితురాలకి కోర్టు ఉపశమనం కలిగించింది. అత్యాచారా బాధితురాలు తన 8 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణపై వెనక్కి తగ్గబోమని, దీనిపై అఫిడవిట్ సమర్పించాలని బాధితురాలి తండ్రిని కోర్టు ఆదేశించింది. తన గర్భాన్ని రద్దు చేయాలంటూ మైనర్ సర్వైవర్ చేసిన పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది.
సాగర్ జిల్లా మెజిస్ట్రేట్(సీజేఎం) ముందు అఫిడవిట్ దాఖలు చేయాలని బాధితురాలి తండ్రిని ఆదేశించింది. నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని, దీంతో తన గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ని జస్టిస్ జిఎస్ అహ్లువాలియా ధర్మాసనం విచారించింది.
Also Read
Read Also: PM Modi: టాప్-3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంటుంది.. ఇదే నా హామీ..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో నిందితుడు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీనిపై గతేడాది అక్టోబర్ 23న కేసు నమోదైంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో, అత్యాచార చట్టాలు, ఎస్సీ/ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.
అయితే అత్యాచార బాధితురాలు గర్భం తీయించుకునేందుకు వైద్యపరంగా రద్దును కోరినందున, వారు ఈ కేసులో దూరంగా ఉండమని పిటిషనర్‌తో పాటు ఆమె తండ్రి కూడా విచారణ అధికారికి అఫిడవిట్ సమర్పించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ బాధితురాలు దీనికి విరుద్ధంగా తనపై నిందితుడు అత్యాచారం చేయలేనది, తనను తాను మేజర్ అని చెప్పుకున్నట్లైతే ట్రయల్ కోర్టు తన నివేదికను ప్రాసిక్యూట్రిక్స్ యొక్క డిపాజిషన్ షీట్‌తో పాటు ఈ కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ముందు సమర్పించాలని ఆదేశిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!