Lottery: అమెరికాలో ఓ వృద్ధ జంట అసలైన జీనియస్‌లని చెప్పొచ్చు. ఏకంగా 26 మిలియన్ డాలర్లు( రూ. 200 కోట్లు)లను లాటరీల్లో సంపాదించింది. ఇతంతా వారి అదృష్టం అంటే మీరు పప్పులో కాలేసిటనట్లే, వీరికి ఉన్న అపారమైన గణిత విద్యను, మ్యాథ్స్ ట్రిక్స్ ఉపయోగించి ఈ లాటరీలను సొంతం చేసుకున్నారు. మిషిగాన్ లోని ఎవర్ట్ ప్రాంతంలోని జెర్రీ, మార్జ్ సెల్బీ జంట ఒక స్టోర్ నిర్వహిస్తుండేవారు. ఈ క్రమంలో 60 ఏళ్లు దాటిన తర్వాత వీరు రిటైరై విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరికి ప్రస్తుతం 80, 81 ఏళ్లు. వీరి జీవిత కథ ఆధారంగా ‘జెర్రీ & మార్జ్ గో లార్జ్.’ అనే సినిమా కూడా వస్తోంది.
ఈ క్రమంలో ఓ రోజు 2003లో సెల్బీ విన్‌ఫాల్ అనే లాటరీ గేమ్‌ని చూశారు. అయితే దీన్ని చూడగానే దీంట్లో ఒక మ్యాథమెటికల్ లూప్‌హోల్ ఉన్నట్లు గమనించాడు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఇందులో డబ్బు సంపాదించవచ్చని అతను కనుగొన్నారు. ఈ జాక్ పాట్ సొమ్ము 5 మిలియన్లకు చేరుకోని ఎవరికీ తగలకపోతే.. ఆ డబ్బు కొన్ని విన్నింగ్ నంబర్లతో ఉన్న టికెట్లకు చేరుతుందని గమనించారు. ఈ లెక్క ప్రకారం 1,100 డాలర్లు వెచ్చించి, కొన్ని సంఖ్యలు ఉన్న 1,100 టికెట్లను కొనుగోలు చేస్తే కనీసం 1900 డాలర్లు పొందవచ్చని గ్రహించారు.
Read Also: Rana Daggubati :మన సంస్కృతికి, మన మనసులకు చాలా దగ్గరగా ఉండేలా “హనుమాన్” చిత్రం రూపొందింది..
ఆ తర్వాత తొలుత 3600 డాలర్ల పెట్టి టికెట్లను కొనుగోలు చేస్తే వీరు 6300 డాలర్లను సంపాదించారు. ఆ తర్వాత 8000 డాలర్లతో టికెట్లు కొనుగోలు చేశారు. ఈ సారి లాభం రెట్టింపైంది. దీంతో వీరిద్దరు కలిసి జీఎస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి స్నేహితులు, బంధువులను ఇందులో చేర్చుకున్నారు. మసాచుసెట్స్‌లో విన్‌ఫాల్ వంటి లాటరీ కొనుగోలు చేస్తే, అక్కడికి వెళ్లి మొత్తం లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు.
గత 9 ఏళ్లలో ఈ టీం మొత్తం 26 మిలియన్ డాలర్లను సంపాదించారు. ఇందులో 8 మిలియన్ డాలర్లను పన్నుల రూపంలో కట్టారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో వీరి ఆరుగురు పిల్లలకు, వారి 14 మంది మనవలు-మనవరాళ్లను, 10 మంది ముని మనవలను చదివించారు. అయితే వీరిపై విచారణ జరిగినా.. పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే కొనుగోలు చేయడంతో వీరిని అక్కడి అధికారులు ఏం చేయలేదు. కేవలం రెండు నిమిషాల్లోనే ఈ ఆటలోని లొసుగులను గమనించి, పెట్టుబడి పెట్టడం ప్రారంభించినట్లు వీరు వెల్లడించారు.