Congress: 2024 సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగబోతోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీని గద్దె దించి కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారం చేపట్టాలని గట్టిగా కోరుకుంటున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఆప్ వంటి కీలక పార్టీలు ఇండియా కూటమి పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే కాంగ్రెస్‌కి మాత్రం కష్టకాలం కనిపిస్తుంది. దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తలుగా సునీల్ కనుగోలు 2024 లోక్‌సభ ఎన్నిలక ప్రచారంలో భాగం…
Pak Terrorist: 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ బుట్టవీ చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ధ్రువీకరించింది. భుట్టవి గత ఏడాది మేలో పంజాబ్ ప్రావిన్స్ లో ప్రభుత్వ కస్టడీలో ఉండగా.. గుండెపోటుతో మరణించాడు. ఇతను లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్‌కి డిప్యూటీగా ఉన్నాడు.
Sensex: భారత మార్కెట్లు ఆల్-టైం హైకి చేరుకున్నాయి. శుక్రవారం రోజు సెన్సెక్స్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఐటీ సంస్థల ఫలితాలు అంచనాలకు మించిన తర్వాత బలమైన డిమాండ్‌పై ఆందోళనలు తగ్గించడంతో లాభాలు వచ్చాయి. సెన్సెక్స్ ఆల్-టైమ్ హై 72,600 పాయింట్లను తాకింది. నిఫ్టీ 200 పాయింట్లకు చేరింది. NSE నిఫ్టీ 50 1.22 శాతం జోడించి 21,911 పాయింట్లకు చేరుకోగా, BSE సెన్సెక్స్ 12.36 గంటల సమయానికి 1.31 శాతం పెరిగి 72,661 వద్దకు చేరుకుంది.
Most Valuable Company: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. యాపిన్ని అధిగమించి ఈ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి యాపిల్ డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటోంది. గురువారం యాపిల్ని అధిగమించి అంత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5 శాతం పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సహాయపడింది.
Vande Bharat: తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇటీవల ప్రయాణికులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలతో కూడిన ఈ ట్రైన్లలో ఫుడ్ మాత్రం అంత నాణ్యతగా ఉండటం లేదు. గతంలో పలువురు ప్రయాణికులు ఆహారం విషయమై ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆకాశ్ కేసరి అనే ప్రయాణికుడికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రైలులో ఇచ్చిన భోజనం దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తుండగా ఈ అనుభవం ఎదురైంది.
Parliament's Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత సెషన్ ప్రారంభమవుతుంది.
Manipur:మణిపూర్‌లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ని వ్యతిరేకించారు. దీనిపై ప్యానెల్ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు. ఏక కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను తాము ఒప్పుకోమని చెప్పారు. జమిలి ఎన్నికలకు ‘‘ అధ్యక్ష పరిపాలనకు ఒక అడుగు’’ అని పేర్కొంది.
Himanta Biswa Sarma: రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. హిందువుల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శిస్తోంది. తాజాగా అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ కాంగ్రెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా ఆ పార్టీ హిందూ వ్యతిరేకి అని స్పష్టమైందని ఆయన గురువారం అన్నారు. మతాన్ని వ్యక్తిగత విషయంగా పేర్కొంటూ, రామమందిరాన్ని బీజేపీ "రాజకీయ ప్రాజెక్ట్"గా పేర్కొంటూ, జనవరి 22న అయోధ్యలో జరగనున్న మహా…
Suchana Seth: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సీఈఓ సుచనా సేథ్ కేసుల యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కొడుకని చూడకుండా.. నాలుగేళ్ల పిల్లాడిని అత్యంత క్రూరంగా హతమార్చింది. కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని గోవా నుంచి కర్ణాటకకు వెళ్తుండగా.. గోవా పోలీసులు ఆమెను చిత్రదుర్గలో అరెస్ట్ చేశారు. నిందితురాలు జనవరి 6న గోవాలోని కాండోలిమ్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో తన కొడుకు గొంతు నులిమి చంపింది. ఈ ఘటన తర్వాత ఆమె కూడా చనిపోయేందుకు ప్రయత్నించిందని కేసు విచారణ అధికారులు తెలిపారు.