Red Ant Chutney: “ఎర్ర చీమల” పచ్చడికి భౌగోళిక గుర్తింపు(GI).. ఈ వంటకం ప్రయోజనాలు, విశేషాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Ant Chutney: “ఎర్ర చీమల పచ్చడి” గిరిజనులకు ఎంతో ముఖ్యమైన వంటకం. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఉంటుంది. నాగరికతకు అలవాటు పడిన మనకు ఇది కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. అయితే, ఒడిశాలోని ‘ఎర్ర చీమల పచ్చడి’కి భౌగోళిక గుర్తింపు(GI ట్యాగ్) లభించింది. ఈ వంటకంలో అనేక పోషక విలువలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఎర్రచీమలతో చట్నీ చేస్తారు. తాజాగా దీనికి జీఐ ట్యాగ్ లభించింది. ఈ వంటకంలో ఔషధ గుణాలతో, అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పచ్చడిని నీళ్లతో కూడిన సెమీ-సాలిడ్ పేస్ట్ లాగా తయారు చేస్తారు. దీనిని స్థానికంగా ‘కై చట్నీ’ అని పిలుస్తారు. జనవరి 2న ఈ విచిత్రమైన వంటకానికి భౌగోళిక గుర్తింపు లభించింది.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ఎలా తయారు చేస్తారు.? ప్రయోజనాలేంటీ..?
సాధారణంగా ప్రపంచంలో పలు కమ్యూనిటీల్లో కీటకాలతో వంటకాలను చేయడానికి, వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని ‘ఎంటోమోఫాగి’ అంటారు. ఒడిశా ప్రజలు ‘రెడ్ వీవర్ చీమలు’, శాస్త్రీయంగా ఓకోఫిల్లా స్మరాగ్డినా అని పిలుస్తారు. మయూర్‌భంజ్ అడవులలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చీమలతో అక్కడి ప్రజలు చట్నీను తయారు చేసి విక్రయిస్తుంటారు. వందలాది గిరిజన కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
వీటిని పట్టుకోవడం అంత సులభం కాదు. మగ చీమలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయి. కుడితే విపరీతమైన మంట, నొప్పి కలుగుతుంది. ఈ చీమల్ని పట్టుకుని దంచి చూర్ణంగా చేసి, ఎండబెడతారు. ఆ తర్వాత దీనికి ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు కలిపి గ్రైండ్ చేసి చట్నీగా తయారు చేస్తారు.
ఈ చీమల పచ్చడిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గూ, ఫ్లూ, శ్వాస సమస్యలు, జలుబు, అలసటకు నివారిణిగా పనిచేస్తుంది. చీమలు, వాటి గుడ్లలో ఉండే ఫార్మిక్ యాసిడ్, మానవ జీర్ణవ వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలో జింక్, కాల్షియం మరియు ప్రోటీన్లు ఉంటాయి, ఇది రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!