LK Advani: శ్రీరాముడే ప్రధాని మోడీని ఎంచుకున్నారు.. నేను కేవలం రథసారధిని మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LK Advani: అయోధ్యంలో రామాలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగబోతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ కూడా ఆహ్వానించారు. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్ సోమనాథ్ నుంచి ప్రారంభమైన రథయాత్ర డిసెంబర్ 6, 1992న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేవరకు అద్వానీ రథయాత్ర సాగింది. ఒక విధంగా చెప్పాలంటే రామాలయ నిర్మాణంలో అద్వానీది ప్రముఖమైన పాత్ర. ఆయన రథయాత్రతోనే రామమందిర నిర్మాణం అనేది జనాల్లో నాటుకుపోయింది. అద్వానీతో పాటు మరో సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషిలు 1990లో రథయాత్రకు నాయకత్వం వహించారు.
Read Also: Ram Temple consecration: అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం..
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అయితే ఇదే రథయాత్ర సమయంలో అద్వానీకి మోడీ సహాయకుడిగా ఉన్నారు. ‘రాష్ట్రధర్మ’ అనే మ్యాగజైన్‌తో మాట్లాడిన అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్టికల్ సోమవారం విడుదల కాబోతోంది. రామాలయం భారతీయులందరూ శ్రీరాముడి గుణాలను అలవర్చుకునేలా ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నట్లు అద్వానీ చెప్పారు. రథయాత్ర సాగే సమయంలో తాను కేవలం ‘రథసారధి’ మాత్రమే అని భావించానని అద్వానీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అద్వానీ, ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు తెలియజేశారు. రాముడి ఆలయాన్ని పునరద్దరించడానికి ప్రధానిమోడీని ఎంచుకున్న భక్తుడని అన్నారు. తన రాజకీయ జీవితంతో అత్యంత నిర్ణయాత్మక, పరివర్తనాత్మక సంఘటన అని అద్వానీ అభివర్ణించారు. ఇది భారతదేశం తనను తాను తిరిగి కనుగొనే అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోడీ ఆలయ ప్రతిష్ట చేసేటప్పుడు, భారతదేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తారని అద్వానీ చెప్పారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!