Swachh Survekshan rankings 2023: కేంద్రం సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ 2023ని కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వరసగా ఏడోసారి మొదటిస్థానంలో నిలిచింది. ఈ సారి ఇండోర్‌తో కలిసి గుజరాత్ సూరత్ నగరం కూడా మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. నవీముంబై(మహారాష్ట్ర), విశాఖపట్టణం(ఏపీ), భోపాల్(మధ్యప్రదేశ్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లు రాష్ట్రాలు దేశంలోనే అత్యధిక పారిశుద్ధ్య ప్రమాణాలను కలిగి ఉన్నట్లుగా కేంద్ర ప్రకటించింది. మిజోరాం, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అత్యంత స్వచ్ఛమైన రాష్ట్రాలుగా ఉన్నాయి. దేశంలో పరిశుభ్రమైన కంటోన్మెంట్ బోర్డు విభాగంలో మధ్యప్రదేశ్ మోవ్ కంటోన్మెంట్ మొదటిస్థానంలో నిలువగా.. నైనిటాల్ కంటోన్మెంట్ చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందించారు.
ఇదిలా ఉంటే దేశంలోనే అత్యంత మురికి నగరంగా పశ్చిమబెంగాల్ లోని హౌరా నగరం నిలిచింది. లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న 10 మురికి నగరాలు పశ్చిమబెంగాల్ లోనే ఉన్నాయి.
హౌరా తర్వాత టాప్-10 మురికి నగరాలు ఇవే:
2) కళ్యాణి
3)మధ్యగ్రామ్
4) కృష్ణనగర్
5) అసన్సోల్
6) రిష్రా
7) బిధాన్‌నగర్
8) కంచ్రాపర
9)కోల్‌కతా
10) భట్పరా