Divya Pahuja: కాలువలో దొరికిన మోడల్ దివ్య పహుజా డెడ్‌బాడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divya Pahuja: మాజీ మోడల్ దివ్య పహుజా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హర్యానాలోని ఓ హోటల్ గదిలో ఆమెను హత్య చేసి, డెడ్‌బాడీని ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నిందితులు డెడ్‌బాడీని ఎక్కడ పారేశారనే విషయంపై పోలసీులు గత కొన్ని వారాలుగా వెతుకుతున్నారు. చివరకు ఓ కాలువలో కుళ్లిపోయిన స్థితితో దివ్యపహుజా మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసిన తర్వాత పొరుగున ఉన్న పంజాబ్‌లోని కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మృతదేహాన్ని కనుగొనేందుకు పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. జనవరి 1న గురుగ్రామ్ లోని ఓ హోటల్‌లో పహుజాను హోటల్ ఓనర్ అభిజీత్ సింగ్ హత్య చేశాడు. హత్యకు సహకరించిన బాల్‌రాజ్ గిల్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని గురుగ్రామ్‌కి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటియాలాలో పారేసినట్లు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కాలువలో డెడ్‌బాడీని గుర్తించారు. శరీరం వెనక ఉన్న టాటూ ద్వారా పహుజానే తెలుసుకోగలిగారు.
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
Read Also: POK: పీఓకేలో పర్యటించిన బ్రిటిష్ రాయబారి.. భారత్ తీవ్ర అభ్యంతరం..
జనవరి 1న దివ్య పహుజా హత్యకు గురైంది. ఐదుగురు వ్యక్తులు 27 ఏళ్ల పహుజాని హోటల్ గదిలోకి తీసుకెళ్లారు. హోటల్ యజమాని అభిజీత్ సింగ్‌కి సంబంధించి కొన్ని అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు పహుజా ఫోన్‌లో ఉన్నాయని, వాటిని తొలగించాలని కోరినా, అందుకు నిరాకరించడంతోనే ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలతో పహుజా బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను హత్య చేసేందుకు మరో నిందితుడు, ప్రధాన నిందితుడైన అభిజీత్ సింగ్‌కి తుపాకీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దివ్య పహుజా 2016లో అప్పటి తన ప్రియుడు మరియు గురుగ్రామ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ యొక్క బూటకపు ఎన్‌కౌంటర్‌లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలతో జైలులో ఉన్నారు. ఆమెకు గత ఏడాది జూన్‌లో బెయిల్ మంజూరైంది.
తాజావార్తలు
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!