Bat Virus: గబ్బిలాల్లో డెడ్లీ వైరస్‌ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. కరోనా లాగే ప్రాణాంతకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bat Virus: గబ్బిలాల్లో ప్రాణాంతక వైరస్‌ని పరిశోధనా బృందం థాయ్‌లాండ్‌లో కనుగొంది. గతంలో కరోనా వైరస్‌తో ముడిపడి ఉన్న ఎకోహెల్త్ అలయన్స్ పరిశోధకులే ఈ డెడ్లీ బ్యాట్ వైరస్‌ని కనుగొన్నారు. ఈ సంస్థ చీఫ్ డాక్టర్ పీటర్ దస్జాక్ కోవిడ్ లాగే మానవులకు సోకే అవకాశం ఉన్న వైరస్‌ని కనుగొన్నట్లు డైలీ మెయిల్ నివేదించింది. గతంలో ఈ పరిశోధర బృందానికి చైనా వూహాన్ వివాదాస్పద ప్రయోగశాలతో సంబంధం ఉంది. థాయ్‌లాండ్ లోని ఓ గుహలోని గబ్బిలాల్లో ఈ వైరస్ కనుగొనబడింది. ఇప్పటికే పరిశోధకులు కనుగొన్న చాలా SARS వైరస్‌లకు కరోనా వైరస్‌లతో సంబంధం ఉందని తేలింది.
Read Also: Himanta Biswa Sarma: కాంగ్రెస్‌కి బాబర్ అంటేనే ప్రేమ.. రాముడిపై కాదు..
Also Read
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
ఇక్కడ స్థానిక రైతులు తమ పొలాల్లో ఎరువుగా వేయడానికి గబ్బిలాల మలాన్ని సేకరిస్తున్నారు. కొత్తగా కనుగొనబడిన వైరస్ కోవిడ్-19కి దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఇది కూడా కోవిడ్ లాగే మానవులకు సోకే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకలు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఈ వైరస్‌కి ఎలాంటి పేరు పెట్టలేదు. గబ్బిలాల మలంలో కూడా ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా కేసులు పెరుగుతున్నాయని, 50 దేశాల్లో 40 శాతం కేసుల సంఖ్య పెరిగినట్లు ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పరిశోధన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.
గతంలో వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019లో చైనాలో బయటపడిన కరోనా వైరస్ ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మరోవైపు కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. ఈ వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. భారత్‌లో కూడా ఈ వేరియంట్ కారణంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!