Skydiver: 29వ అంతస్తు నుంచి పడి స్కైడైవర్ దుర్మరణం.. పారాచూట్ విఫలం కావడంతో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Skydiver: సాహసం చేయాలనే ప్రయత్నం విషాదాన్ని నింపింది. డేర్ డెవిల్‌గా పిలువబడే నాతీ ఓడిన్సన్ అనే స్కైడైవర్ 29వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటన్‌కి చెందిన 33 ఏళ్ల ఓడిన్సన్ థాయ్‌లాండ్ లోని పట్టాయాలో భవనం నుంచి స్కై డైవింగ్ చేయాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పారచూట్, హెల్మెట్ సిద్ధమైన తర్వాత ఈ ఫీట్‌ని అతని స్నేహితుడు కింద నుంచి రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ స్టంట్ సమయంలో ఓడిన్సర్ ధరించిన పారాచూట్ తెరుచుకోకపోవడంతో చెట్టును బలంగా ఢీకొట్టి నేలపై పడ్డాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ స్టంట్ కోసం అతను పర్మిషన్ తీసుకోలేదని తెలుస్తోంది.
Read Also: CAA: 7 రోజుల్లో దేశవ్యాప్తంగా “సీఏఏ” అమలు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
Also Read
ఓడిన్సన్ ఓ నిపుణుడైన స్కైడైవర్. కానీ అతని సాహసం విషాదంగా మిగిలింది. అతను నేలపై పడిపోయిన తర్వాత పారామెడిక్స్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని అతను మరణించినట్లు ప్రకటించారు. సెక్యూరిటీ గార్డు కానెట్ చాన్సోంగ్ ఈ భయంకరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘‘ నేను చెట్టు శబ్ధం విన్నాను. ఒక మహిళ కేకులు వేయగా అక్కడికెళ్లి చూడగా అతను చనిపోయి ఉన్నాడు’’ అని చెప్పాడు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. పారాచూట్ విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనను రికార్డ్ చేసిన అతని స్నేహితుడిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై థాయ్‌లాండ్ బ్రిటన్ ఎంబసీకి సమాచారం ఇచ్చింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?