PM Surya Ghar Yojana: ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. సౌరశక్తి, స్థిరమైన పురోగతిని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘పీఎం సూర్య ఘర్ యోజన: ఉచిత విద్యుత్ పథకం’ని ప్రారంభించబోతోంది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి ఇళ్లలో వెలుగులు నింపడం ఈ పథకం లక్ష్యం. ఈ ప్రాజెక్టులో రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని ప్రధాని చెప్పారు.
Read Also: Biren Singh: మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతాం..
‘‘ మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం మేము ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నాము. ఈ ప్రాజెక్టు రూ. 75,000 కోట్ల పెట్టుబడితో 300 యూనిట్ల వరకు కోటి కుటుంబాలకు ప్రతీ నెల ఉచిత విద్యుత్ అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా సబ్సిడీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు. వాటాదారులందరూ.. జాతీయ ఆన్‌లైన్ పోర్టల్‌కు అనుసంధానించబడతారని ప్రధాని వెల్లడించారు.
ఈ పథకం ద్వారా మరింత ఆదాయానికి, తక్కువ విద్యుత్ బిల్లులకు, ప్రజల ఉపాధి కల్పనకు దారి తీస్తుంది అని ప్రధాని చెప్పారు. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్‌ని ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. ‘‘సోలార్ పవర్ మరియు స్థిరమైన పురోగతిని పెంచుకుందాం. నేను అందరు గృహ వినియోగదారులను, ముఖ్యంగా యువకులను, ప్రధానమంత్రి-సూర్య ఘర్: మఫ్ట్ బిజిలీ యోజనను – https://pmsuryaghar.gov.inలో దరఖాస్తు చేయడం ద్వారా బలోపేతం చేయాలని కోరుతున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.
In order to popularise this scheme at the grassroots, Urban Local Bodies and Panchayats shall be incentivised to promote rooftop solar systems in their jurisdictions. At the same time, the scheme will lead to more income, lesser power bills and employment generation for people.
— Narendra Modi (@narendramodi) February 13, 2024