Taliban: తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడులు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను ఉద్దేశించి తాలిబాన్ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో మునీర్‌కు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ సైన్యం తన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టకుండా, బదులుగా ఉన్నత సైనికాధికారులే స్వయంగా యుద్ధరంగానికి రావాలని టీటీపీ అగ్ర కమాండర్ మునీర్‌ని బెదిరిస్తూ వీడియోలో హెచ్చరించారు. Read Also: PM Modi: రేపటి నుంచే బీహార్‌లో మోడీ ఎన్నికల […]
Karnataka: కర్ణాటక చిత్తాపూర్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ర్యాలీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. శాంతిభద్రతల సమస్యను పేర్కొంటూ అధికారులు అనుమతికి నిరాకరించారు. ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి, సంస్థ శతాబ్ది ఉత్సవాలకు, విజయదశమి ఉత్సవం కోసం పట్టణంలో చిన్న స్థాయి ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి కోరారు. దీనికి పోలీసుల నుంచి నిరాకరణ ఎదురైంది. ఆదివారం ఆర్ఎస్ఎస్ మార్చ్‌కు అనుమతి కోరిన అదే మార్గంలో భీమ్ ఆర్మీ,భారతీయ దళిత్ పాంథర్ (R) […]
High Court: మతాంతర జంటను నిర్భందించినందుకు పోలీసులపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 15న కోర్టు ప్రాంగణంలోనే మతాంతర జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారిని శనివారం న్యాయమూర్తులు సలీల్ కుమార్ రాయ్, దివేష్ చంద్ర సమంత్ల ధర్మాసనం ముందు హాజరుపరిచారు. షేన్ అలీ, రష్మీలను కస్టడీలోకి తీసుకోవడం ‘‘చట్టవిరుద్ధం’’అని ధర్మాసనం పేర్కొంది. ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈ జంటను కస్టడీలోకి తీసుకున్నారని, వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక సభలో ప్రసంగిస్తూ.. ‘‘నేను మీకు ఒక సూచన ఇవ్వాలనుకోవడం లేదు, కానీ నేను రాముడి పేరు మీద ఒక సూచన ఇస్తాను. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా అన్ని నగరాలు ప్రకాశవంతంగా ఉంటాయి.
UP: తోడబుట్టిన సోదరుడి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ మహిళ సొంత భర్త ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన మీరట్‌లో జరిగింది. స్థానిక వస్త్ర వ్యాపారి ఇంటి నుంచి రూ. 30 లక్షలు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో ఆయన భార్యే నిందితురాలు అని తేలింది. తన సోదరుడి ప్రాణాలు రక్షించేందుకు మూత్రపిండాల చికిత్స కోసం ఆమె ఈ దొంగతనానికి పాల్పడింది.
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. తన స్నేహితుడు, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో ఒక యువకుడు హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది. శనివారం ఉదయం శ్యామ్‌నర్ మల్టీలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
Maruti Suzuki: ఇండియన్ కార్ మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకికి ‘‘ధన్‌తేరాస్’’ కలిసి వచ్చింది. తన అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. రెండు రోజుల పండగ కాలంలో 50,000 కార్లను డెలివరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. శనివారం సాయంత్రం నాటికి కంపెనీ ఇప్పటికే దాదాపు 38,500 వాహనాలను డెలివరీ చేసింది. శ
No Kings protests: అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతరేకంగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ‘‘ నో కింగ్స్’’ అనే పేరుతో ప్రజలు నిరసనలు నిర్వహిస్తున్నారు. శనివారం న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
Karur stampede: చెన్నైతో పాటు తమిళనాడు అంతటా దీపావళి శోభ కనిపిస్తుంటే, తమిళ స్టార్‌కు విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయం నిర్మానుష్యంగా కనిపించింది. ఇటీవల, విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. వీరి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం దీపావళి జరుపుకోవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ కేడర్లు అందరితో పాటు జిల్లా కార్యదర్శులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీవీకే కార్యాలయాల్లో చీకటి అలుముకుంది.
Delhi High Court: ఇటీవల విడాకులు, ‘‘భరణాల’’కు సంబంధించిన కేసులు ఎక్కువ అవుతున్నాయి. విడాకుల తర్వాత మహిళలు పెద్ద మొత్తంలో భరణాన్ని కోరుతున్న కేసులపై పలు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా, ఢిల్లీ హైకోర్టు కూడా కీలక ఒక భరణం కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భరణం అనేది ఒక సామాజిక న్యాయం మాత్రమే అని, ఇది భాగస్వామి ఆర్థికంగా బలపడేందుకు , ఆర్థిక సమానత్వం కోసం ఉపయోగించే సాధనం కాదు’’ అని జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, హరీష్…