Afghan -Pak War: పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య తీవ్ర సరిహద్దు పోరాటం జరుగుతోంది. రెండు వైపుల కూడా పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. చివరక సౌదీ అరేబియా, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య 48 గంటల ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉంటే, నిజంగా పూర్తిస్థాయిలో యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా.
లండన్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డేటా ప్రకారం.. పాకిస్తాన్ సైన్యం నిరంతర రిక్రూట్మెంట్లు కలిగి ఉంది. ముఖ్యంగా, చైనా నుంచి విరివిగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. పాకిస్తాన్‌కు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. అదే సమయంలో ఆఫ్ఘానిస్తాన్ కేవలం తాలిబాన్ ఫైటర్ల సాయంతో దాడులు చేస్తోంది. 2021లో ఆఫ్ఘానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత, అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాలనున వాడుతోంది. తాలిబాన్ పాలనకు అంతర్జాతీయ గుర్తింపు లేకపోవడంతో సైనిక ఆధునీకరణ కూడా దెబ్బతింది.
పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్..
పాకిస్తాన్ రక్షణ దళాల్లో 6,60,000 మంది యాక్టివ్ ఫోర్స్ ఉంది. వీరిలో 560,000 మంది సైన్యంలో, 70,000 మంది వైమానిక దళంలో మరియు 30,000 మంది నావికాదళంలో ఉన్నారు. పాకిస్తాన్ కు 6000 ఆర్మ్డ్ వాహనాలు ఉన్నాయి. 4600 ఆర్టిలరీ ఉంది. పాకిస్తాన్ వద్ద 465 యుద్ధ విమానాలు, 260 కంటే ఎక్కువ హెలికాప్టర్లు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధాన బలం దాని అణ్వాయుధాలు. 170 వార్ హెడ్స్ ఉన్నట్లు అంచనా. ఆఫ్ఘాన్ వద్ద ఎలాంటి అణ్వాయుధాలు లేవు.
ఆఫ్ఘనిస్తాన్ వద్ద పాకిస్తాన్ తో పోలిస్తే చాలా తక్కువ. కేవలం 1,72,000 మంది క్రియాశీల సిబ్బంది ఉంది. ప్రస్తుతం, తాలిబాన్లు తమ సైన్యాన్ని 2 లక్షలకు మందితో విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఆఫ్ఘాన్ వద్ద సోవియట్ కాలం నాటి యుద్ధ ట్యాంకులు, ఆర్మీ వాహనాలు మాత్రమే ఉన్నాయి. ఆఫ్ఘానిస్తాన్‌కు ఎయిర్ ఫోర్స్ లేదు. యుద్ధవిమానాలు లేవు. ఆఫ్ఘాన్ వద్ద ఆరు విమానాలు ఉన్నాయి, ఇవి కూడా సోవియట్ కాలం నాటివే. 23 హెలికాప్టర్లు ఉన్నాయి. అయితే, ఇవి టేకాఫ్ అయ్యే స్థితిలో ఉన్నాయో లేదో తెలియదు.
ఆఫ్ఘాన్ అసలు బలం అదే:
బలాబలాలు ఎలా ఉన్నా, ఆఫ్ఘాన్ల అసలు బలం వారి గెరిల్లా వార్‌ఫేర్. వెన్నుచూపని తత్వం. బ్రిటీష్ ఇండియా సమయంలో బ్రిటీష్ వారు కూడా వీరితో ఒక ఒప్పందానికి వచ్చి ఆఫ్ఘాన్, బ్రిటీష్ ఇండియా మధ్య ‘‘డ్యూరాండ్ రేఖ’’ను గీశారు. ఆ తర్వాత, సోవియట్ సైన్యాన్ని ఆఫ్ఘాన్ నుంచి వెళ్లగొట్టడం తాలిబాన్ల పోరాటమే కీలకం. 2021 వరకు అమెరికా మద్దతు ఉన్న ఆఫ్ఘాన్‌లోని పౌర ప్రభుత్వం కూడా వీరిని తట్టుకోలేక చేతులెత్తేసింది.