Adina mosque: మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని ‘‘ఆదినా మసీదు’’ను సందర్శించారు. సందర్శించిన సమయంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. తన పోస్టులో ‘‘ ఆదినా మసీదు ఒక అద్భుతమని ’’ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా యూసఫ్ పఠాన్‌పై బీజేపీ, సోషల్ మీడియా నెటిజన్ల నుంచి విమర్శలు ప్రారంభయ్యాయి.
ఇదిలా ఉంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామం, గ్రామ ప్రజలు శతాబ్ధాలుగా దీపావళి పండగకు దూరంగా ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లాలోని సమ్మూ గ్రామం ఎన్నో వందల ఏళ్లుగా పండగను జరుపుకోవడం లేదు. దీనంతటికి ఓ ‘‘సతి’’ శాపమే కారణం. ఒక మహిళన తన భర్త చితిలో దూకి నిప్పటించుకుని శపించినప్పటి నుంచి,
Pakistan: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంతో ‘‘డ్యూరాండ్ లైన్’’ వద్ద తుపాకులు గర్జిస్తున్నాయి. ఇప్పటికే, రెండు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, పాకిస్తాన ఆఫ్ఘాన్ సరిహద్దు జిల్లాలపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పాక్-అఫ్ఘాన్ వివాదాన్ని భారత్‌తో ముడిపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ లో నివసిస్తున్న అందరు అఫ్ఘాన్లు స్వదేశానికి వెళ్లాలని ఆదేశించారు.
GST 2.0 report: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు సామాన్యుడికి మేలు చేశాయని కేంద్రమంత్రులు చెప్పారు. జీఎస్టీ రిపోర్టును మీడియాతో పంచుకున్నారు. జీఎస్టీ రేటు తగ్గింపుల వల్ల తగ్గిన పన్నుల ప్రయోజనాలు దేశ ప్రజలకు అందాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రమంతులు పియూష్ గోయల్, అశ్విని వైష్ణవ్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. దసరా ముందు వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగాయని ఆమె చెప్పారు.
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బుద్ధి ఇంకా మారలేదు. పహల్గామ్ దాడి తర్వాత, పాక్ సైన్యాన్ని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా చిత్తు చేసినప్పటికీ, ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. మరోసారి, భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యాన్ని ప్యాంట్లు విప్పించి, పరిగెత్తిస్తున్నా కూడా తమది గ్రేట్ ఆర్మీ అని పాక్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. తమ వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని బెదిరించే ప్రయత్నం చేశాడు.
Rajnath Singh: పాకిస్తాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని శనివారం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశానికి విజయం ఒక అలవాటుగా మారిందని నిరూపణ అయిందని ఆయన అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లో కలిసి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. Read Also: Shubman Gill: […]
Cambodia-Thailand:ఈ ఏడాది కంబోడియా, థాయిలాండ్ మధ్య చిన్నపాటి యుద్ధమే సాగింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఇదిలా ఉంటే, థాయిలాండ్ ఇప్పటికీ తమపై ‘‘మానసిక యుద్ధం’’ కొనసాగిస్తోందని కంబోడియా ఆరోపిస్తోంది. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ ఈ ఆరోపణలు చేశారు. జూలై నెలలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. అయినప్పటికీ, థాయిలాండ్ మానసిక యుద్ధంలో పాల్గొంటోందని కంబోడియా మానవ హక్కుల కమిషన్ ఆరోపించింది.
Afghan-Pakistan War: వెన్నుపోటు పొడవడం పాకిస్తాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇది మరోసారి నిజమైంది. ఆఫ్ఘానిస్తాన్ దాడులకు తాళలేక, మధ్యవర్తిత్వం చేసి, దాడుల్ని ఆపేలా చేయాంటూ సౌదీ అరేబియా, ఖతార్‌లను పాకిస్తాన్ వేడుకుంది. శుక్రవారం, ఖతార్ వేదికగా పాక్, తాలిబాన్ అధికారుల మధ్య మరో 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం పొడగించాలని నిర్ణయం కుదరింది. Read Also: Tripura: పశువుల్ని దొంగిలించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం.. అయితే, దీనిని పట్టించుకోని పాకిస్తాన్ […]
Tripura: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోకి చొరబడిన ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లు, భారతీయుడిని హత్య చేశారు. ఆ తర్వాత ముగ్గురుని గ్రామస్తులు ప్రతీకార దాడిలో హతమార్చారు. ఇది భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదంగా మారింది. అక్టోబర్ 15న జరిగిన ఈ సంఘటన దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది.
Fraud: వైద్య వృత్తిలో ఉన్న ఓ కిలాడీ జంట చిట్టీల పేరుతో మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో ప్రజల్ని మోసగించిన దంపతుల సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంపేట బండారీ లేఅవుట్లో ‘రేష్మ క్లినిక్’’ పేరుతో వైద్యులుగా చలామణి అవుతున్న రేష్మ, అలీ అనే భార్యాభర్తలు సుమారు 100 మందికి పైగా వ్యక్తుల నుంచి దాదాపుగా రూ. 150 మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది.