Law Commission: ఎన్నారైలు భారతీయ పౌరులను ముఖ్యంగా అమ్మాయిలను మోసపూరితంగా వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇలాంటి కేసులు ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాసులు, భారతీయులను పెళ్లి చేసుకునే విషయంలో సమగ్ర చట్టాలను తీసుకురావాలని లా ప్యానెల్ సిఫారసు చేసింది. “ప్రవాస భారతీయులు మరియు విదేశీ పౌరులకు సంబంధించిన మ్యాట్రిమోనియల్ ఇష్యూలపై చట్టం”పై ప్యానెల్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) రీత్ రాజ్ అవస్తీ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు నివేదిక అందించారు.
Read Also: Aa Okkati Adakku: పెళ్లి కాని ప్రసాదుల గురించి మరో సినిమా.. ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటున్న అల్లరి నరేష్
ప్రవాస భారతీయులు (NRIలు) భారతీయ పౌరులను మోసపూరితంగా వివాహాలు చేసుకోవడం పెరుగుగోతందని, అనేక వివాహాలు మోసపూరితంగా మారుతన్నాయి. ఇది ఆందోళన కలిగించే ధోరణి అని, ముఖ్యంగా స్ట్రీల జీవితాలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని లా కమిషన్ నొక్కి చెప్పింది. న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌కి జస్టిస్ అవస్తీ ఈ విషయాన్ని గురువారం తెలిపారు. ఇటువంటి చట్టాన్ని కేవలం ఎన్‌ఆర్‌ఐలకే కాకుండా పౌరసత్వ చట్టం, 1955లో పేర్కొన్న ‘ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా’ (ఓసీఐ) నిర్వచనం పరిధిలోకి వచ్చే వ్యక్తులకు కూడా వర్తింపజేయాలని ప్యానెల్ పేర్కొంది. ఎన్‌ఆర్‌ఐలు/ఓసీఐలు మరియు భారతీయ పౌరుల మధ్య జరిగే అన్ని వివాహాలను భారతదేశంలో తప్పనిసరిగా నమోదు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసింది.
ఎన్నారైల వివాహాల చట్టానికి సంబంధించి అందులో విడాకులు, జీవత భాగస్వామి నిర్వహణ, పిల్లల సంరక్షణ, సమన్లు, వారెంట్లు లేదా ఎన్ఆర్ఐ, ఐసీఐలపై న్యాయపరమైన చర్యలకు సంబంధించి నిబంధనలు చేర్చాలని జస్టిస్ అవస్తీ సూచించారు. మ్యారేజ్ స్టేటస్ ప్రకటించడం, జీవత భాగస్వామి పాస్‌పోర్టును లింక్ చేయడం, ఇద్దరి పాస్‌పోర్టులపై వివాహ రిజిస్ట్రేషన్ నెంబర్ పేర్కొనడం తప్పనిసరి చేయాలని, పాస్‌పోర్టు చట్టం-1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని లా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ పరిస్థితులను, మోసాలను ఎదుర్కొనేందుకు నాన్-రెసిడెంట్ భారతీయుల వివాహ నమోదు బిల్లు, 2019ని ఫిబ్రవరి 11, 2019న రాజ్యసభలో ప్రవేశపెట్టినట్లు కమిషన్ గుర్తుచేసింది. ప్రస్తుతం లోక్‌సభ ఈ బిల్లును విదేశీ వ్యవహారాల కమిటీకి పంపింది.