Breaking News: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని తీవ్రస్థాయిలో విమర్శించే వ్యక్తిగా నవల్నీకి గుర్తింపు ఉంది. రష్యాలోని ఆర్కిటిక్ జైలు కాలనీలో 19 ఏళ్లపాటు శిక్షను అనుభవిస్తున్న నవల్నీ శుక్రవారం మరణించినట్లు రష్యా ఫెడరల్ పెనిటెన్షియల్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. నడక తర్వాత నవల్నీ అసౌకర్యానికి గురయ్యాడని, వెంటనే స్పృహ కోల్పోయాడని, సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేదని, తర్వాత అతను చనిపోయారని తెలిపింది.
Read Also: Delhi Assembly: కేజ్రీవాల్ షాకింగ్ నిర్ణయం.. ఫ్లోర్‌టెస్ట్‌కు తీర్మానం
47 ఏళ్ల అలెక్సీ నవల్నీ రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ఎదురుతిరగడం, ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా ఒక్కసారిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. నవల్నీ మరణం గురించి క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్, అధ్యక్షుడు పుతిన్‌కి తెలియజేశారు. ఆగస్ట్ 2020లో సైబీరియాలో విష ప్రయోగం జరిగినట్లు గతంలో నవల్నీ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు తనను చంపేందుకు ప్రయత్నించాడని చెప్పాడు.