Amethi: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అమేథీ వేదికగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒకే రోజు పలు కార్యక్రమాలుకు హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఈ రోజు అమేథీ పట్టణంలోని ప్రవేశిస్తోంది. కొన్ని దశాబ్ధాలుగా గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీని బీజేపీ బరిలో నిలిపి గెలిపించింది. అయితే, ఈ ఇద్దరు నేతలు కూడా ఒకేసారి అమేథికి రావడం ఇది రెండోసారి మాత్రమే. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు వేర్వేరు ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు.
Read Also: Pakistan: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. భుట్టో షరతులకు నవాజ్ అంగీకారం..
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నాలుగు రోజుల పాటు అమేథీలో మకాం వేయనున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ జోడో యాత్రతో ఈ రోజు అమేథికి చేరుకోనున్నారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్‌కి మద్దతు కూడగట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు రోడ్ షోతో పాటు బహిరంగ సభ ఏర్పాటు చేశారు.