MSVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ రివ్యూ.. అనిల్ రావిపూడి దొరికేశాడా?
- మన శంకర వరప్రసాద్ గారు నేడు విడుదల
- ముందునుంచి సినిమాపై భారీ అంచనాలు
- ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్‌గా నటించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న ఈ సినిమాపై ముందునుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. మన శంకరవరప్రసాద్ గారు నేడు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఓవర్సీస్ రివ్యూ ఓసారి చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి సింపుల్ ఎంట్రీతో స్టార్ట్ అయిన సినిమా.. మొదట చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. కథలోకి వెళ్లే కొద్దీ గాడిన పడుతుంది. మంచి సాంగ్స్, చిరు తన ట్రేడ్‌మార్క్ టైమింగ్‌తో అలరిస్తారు. కామెడీ కొన్ని చోట్ల మెప్పిస్తుంది. అలాగే కొన్ని ఎపిసోడ్స్ చిరు ఒకప్పటి సినిమా ‘డాడీ’ని గుర్తుకుతెస్తుంది. కొత్తగా ఏమీ అనిపించదు కానీ.. అలరిస్తుంది. తనదైన పచులతో వింటేజ్ చిరు గుర్తుకువస్తాడు. హుక్ స్టెప్ సాంగ్ మెగా అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుంది. మొత్తంగా ఫస్టాఫ్ మెప్పిస్తుంది.
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
Also Read: Shubman Gill: బౌలర్లకు అవకాశాలు.. శుభ్‌మన్ గిల్ ఏమ్మన్నాడంటే?
ఇక సెకండాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికే ఏదో తేడా కొడుతుందే అనే ఫీల్ తెస్తుంది. ప్రథమార్ధంలో ఉన్న వేగం ద్వితీయార్ధంలో కనిపించదు. కథ నెక్ట్స్ ఏమి జరగబోతుందో ఇట్టే తెలిసిపోతుంది. కొత్తగా ఏమీ అనిపించక పోగా.. రొటీన్ రెగ్యులర్‌గా బోర్ ఫీల్ అనిపిస్తుంది. చివరలో ‘విక్టరీ’ వెంకటేష్ రంగప్రవేశంతో ఉత్సాహం వస్తుంది. ఆ సీన్లు కూడా ఆహా అనే రేంజ్‌లో ఏముండదు. జస్ట్ ఒకే అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే రొటీన్‌గా.. గతంలో చాలా సినిమాలలో చూసేసిన ఫీల్ వస్తుంది. ఓవరాల్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రేంజ్ కాదు కానీ.. F3 సినిమాలా ఓ మోస్తరు కామెడీ సినిమా. ఎప్పుడు కామెడీతో నెట్టుకొచ్చే అనిల్ రావిపూడి.. ఈసారి దొరికేసాడనే టాక్ ఓవర్సీస్ ఆడియెన్స్ నుంచి వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!