Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లకు హాజరుకాలేదు. ఈడీ సమన్లను దాటవేయడం ఇది ఆరోసారి. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని.. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో.. ఈడీ స్వయంగా కోర్టును ఆశ్రయించిందని.. పదేపదే సమన్లు జారీ చేసే బదులు, ఈ అంశంపై కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని సూచించింది.
Read Also: Inter Board Focus: అధికారులకు సర్కార్ ఆర్డర్.. ముందస్తు చర్యలపై ఇంటర్ బోర్డ్ దృష్టి..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పలుమార్లు ఈడీ కేజ్రీవాల్‌కి సమన్లు జారీ చేసింది. సమన్లకు హాజరుకాకపోవడంతో ఈడీ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. కోర్టుకు కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. మరోవైపు, తాను విచారణకు హాజరైతే ఈడీ అరెస్ట్ చేయాలని భావిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. లిక్కర్ కేసులో ఇప్పటికే ఆప్ కీలక నేతలైన సత్యేందర్ జైన్, మనీస్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ విచారణకు పిలిచి అరెస్ట్ చేసింది.