Jio phone: 2024 చివరి నాటికి సరసమైన ధరలో రిలయన్స్ జియో 5G మొబైల్‌ని అందించబోతోంది. క్వాల్‌కామ్ సహాకారంతో జియో ఈ ఫోన్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురానుంది. కేవలం రూ. 10,000 కంటే తక్కవ ధరకే జియో ఫోన్‌ని అందించబోతున్నారు. భారతదేశంలో త్వరలో కొత్త 5జి జియో ఫోన్లను విడుదల చేయడానికి రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నట్లు క్వాల్‌కామ్ ధృవీకరించింది. క్వాల్‌కామ్ చిప్ సెట్‌తో జియో ఫోన్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరి నాటికి ఫోన్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. స్పెయిన్ బార్సిలోనాలో జరిగిన వరల్డ్ మొబైల్ కాంగ్రెస్-2024లో ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also: Antony Review: కళ్యాణి ప్రియదర్శన్- ఆంటోనీ రివ్యూ
క్వాల్‌కామ్ ఎస్‌వీపీ, హ్యాండ్ సెట్స్ జనరల్ మేనేజర్ క్రిస్ పాట్రిక్ మాట్లాడుతూ.. సరసమైన ధరల్లో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు పూర్తి 5జి అనుభవాన్ని ఇవ్వాలని చూస్తున్నామని, మేము 4 జీ నుంచి 5 జీ మార్పుపై చాలా ఎక్కువగా దృష్టిపెడుతున్నామని ఆయన వెల్లడించారు. భారతదేశంలోని 2జీ వినియోగదారులు 5జీ కనెక్టివిటీ ఉన్న ఫోన్లకు మారాలని మరింత ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. చిప్‌సెట్ అభివృద్ధి చేయడంలో ప్రస్తుతం భారత ఆర్ అండ్ డీ టీమ్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్, బెంగళూర్ లోని మా లోకల్ టీం ప్రపంచ ఉత్పత్తుల కోసం నాయకత్వం వహిస్తున్నాయని చెప్పారు.