Diwali Gift: దీపావళి రోజు గిఫ్ట్ ఇవ్వని కారణంగా చెలరేగిన వివాదం ఒకరి హత్యకు కారణమైంది. తన యజమాని నుంచి దీపావళి రోజు ఏదో ఒక గిఫ్ట్ వస్తుందని భావించిన వ్యక్తిని నిరాశ ఎదురుకావడంతో, అతను తన యజమానికి ఫోన్ చేసి దుర్భాషలాడటంతో హత్య జరిగింది.
Doctor Suicide: మహారాష్ట్రలో వైద్యురాలి ఆత్మహత్య సంచలనంగా మారింది. తనపై ఐదు నెలల్లో నాలుగు సార్లు పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్(ఎస్ఐ) అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు తన ఎడమ చేతిపై సూసైడ్ నోట్ రాసి, దారుణానికి ఒడిగట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. అతడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం […]
Indian Military: భారత సైన్యం మరింత ఆధిపత్యాన్ని చూపబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చే విధంగా భారత సైన్యానికి రూ. 79,000 కోట్లతో రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ‘‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్’’ ఆమోదం తెలిపింది.
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు
Delhi High Court: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్నేహాన్ని అత్యాచారానికి లైసెన్సుగా పరిగణించలేమని, లైంగిక వేధింపులు, నిర్భంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా ఉపయోగించలేమని పేర్కొంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిందితుడికి బెయిల్‌ను నిరాకరించారు.
Justice Surya Kant: భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నెలల తర్వాత, ఆయన వారసుడిని నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23తో ముగుస్తోంది. రేపటిలోగా తన వారసుడిని సిఫారసు చేయమని కోరుతూ ప్రభుత్వం గవాయ్‌కి లేఖ రాసినట్లు సమాచారం. గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ విమరణ చేసే వరకు ప్రధాన న్యాయమూర్తిగా…
S*x Warfare: టెక్ కంపెనీల రహస్యాలను, ట్రేడ్ సీక్రెట్లకు సంబంధించిన రహస్యాలను సేకరించడానికి కొత్త తరహా ‘‘గూఢచర్యం’’ జరుగుతోంది. ముఖ్యంగా అమెరికా సిలికాన్ వ్యాలీకి సంబంధించిన పలు కంపెనీల వివరాలను సేకరించడానికి చైనీస్, రష్యన్లు ‘‘సె*క్స్ వార్ఫేర్’’ను ప్రారంభించారు. అందమైన, ఆకట్టుకునే మహిళల్ని వాడుకుని, ఉద్యోగుల నుంచి వివరాలను రాబడుతున్నారు.
Karnataka: కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూర్ సౌత్ ఎంపీ, బీజేపీ తేజస్వీ సూర్యను ‘‘అమావాస్య’’గా పిలిచారు. దీనికి తేజస్వీ స్పందిస్తూ.. సీఎం సిద్ధరామయ్య ‘‘కర్ణాటకకు గ్రహణం’’ అని అన్నారు. సిద్ధరామయ్య పాలన రాష్ట్రానికి గ్రహణం లాంటిది అని విమర్శించారు. Read Also: CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అత్యవసర నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు.. తనను అమావాస్య, పౌర్ణమిగా […]
Reel On Track: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలను తీస్తోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని, వ్యూస్, సబ్స్క్రైబర్లను పెంచుకోవాలనే పిచ్చి కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ 15 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా మరణించాడు. ఒడిశాలోని పూరిలోని రైల్వే ట్రాక్‌పై రీల్ షూట్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొని మరణించాడు.
Carbide gun: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రజలు తమ కుటుంబాలతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, కొందరికి మాత్రం దీపావళి విషాదాన్ని మిగిల్చింది. కంటిచూపు కోల్పోయేలా చేసింది. ‘‘కార్బైడ్ గన్’’ వల్ల మధ్యప్రదేశ్‌లో 122 మంది పిల్లలు గాయపడ్డారు. వీరిలో 14 మంది కంటి చూపు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గాయపడ్డారు. ఈ కార్బైడ్ గన్ను ‘‘దేశీ ఫైర్ క్రాకర్ గన్’’గా కూడా పిలుస్తారు. Read Also: Chiranjeevi : చిరంజీవి […]