Sweden: యూరప్ దేశాలకు ఏమైంది. సొంత దేశ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా కూడా, మానవ హక్కులు, శరణార్థి హక్కులు అంటూ వ్యవహరిస్తూ, నేరస్తుల్ని శిక్షించడం లేదు. శరణార్థులుగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల నుంచి యూరప్ దేశాలకు వచ్చిన వ్యక్తులు నేరాల్లో భాగస్వాములు అవుతున్నారు. బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ ఇలా పలు దేశాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా, 16 ఏళ్ల అమ్మాయి అత్యాచార కేసులో స్వీడన్ కోర్టు ఇచ్చిన తీర్పును, ప్రపంచం […]
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్‌గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
India-Pakistan: అమెరికా నిఘా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాజీ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తప్పకుండా ప్రకంపనలు సృష్టిస్తాయి. 2001 పార్లమెంట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్‌లు యుద్ధానికి దిగుతాయని సీఐఏ విశ్వసించిందని జాన్ కిరియాకౌ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Bihar Elections: బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయితో లవ్‌లో ఉన్నానని ప్రకటించిన తర్వాత తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆయన జనశక్తి జనతాదళ్ (JJD) పార్టీని పెట్టారు.
Saudi-Pakistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో చావు దెబ్బలు, ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడాలని దాయాది భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన సైన్యాన్ని ఆధునీకీకరించుకోవాలని భావించడంతో పాటు పెట్టుబడుల వేటను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే సౌదీ అరేబియా రూపంలో ఓ ఆశ పాకిస్తాన్‌కు చిగురించింది. డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికైనా ఇప్పుడు ఆ దేశం సిద్ధంగా ఉంది. ఇటీవల, సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ […]
UP: ఏం మనుషులురా మీరు, మగబిడ్డ కోసం ఒక మహిళను మామ, బావ దగ్గర పడుకోవాలని బలవంతం చేశారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది. మగబిడ్డపై ఉన్న కోరికతో రెండు సార్లు అబార్షన్లు చేయించారు. దీని తర్వాత ఆమె మామ, బావతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది. 2021లో మెహక్ ఖాన్‌కు షా ఫహీమ్ అనే వ్యక్తితో వివాహమైంది. కొన్ని నెలల్లోనే ఆమె భర్త, అత్తంటి వారి నుంచి వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి. […]
Pakistan: ఇటీవల పాకిస్తాన్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ లో ఇస్లామిస్ట్ అతివాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) నిరసనల్లో తీవ్ర హింస చోటు చేసుకుంది. ముఖ్యంగా లాహోర్ నగరం రక్తసిక్తంమైంది.
S-400: పాకిస్తాన్, చైనా దేశాలకు చేదు వార్త. భారత్ రక్షణ దళాలు రష్యాకు బయలుదేరాయి. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఒకటైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై అధునాతన శిక్షణ తీసుకోవడానికి మన సైనికులు పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్లారు.
Bharat Taxi: కేంద్రం ‘‘భారత్ టాక్సీ’’ని ప్రారంభించింది. ఇది ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫారమ్‌లను నేరుగా సవాల్ చేయనుంది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, జాతీయ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD)లు ఈ సర్వీస్‌ను ప్రారంభించాయి. డ్రైవర్లకు వారి సంపాదనపై పూర్తి హక్కును ఇవ్వడంతో పాటు ప్రయాణికులకు ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు బదులుగా ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Hyundai Venue: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన కొత్త వెన్యూ(Venue) కోసం బుకింగ్ ప్రారంభించింది. ఆల్ న్యూ వెన్యూ సరికొత్త డిజైన్, స్టైల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మార్పులతో రాబోతోంది. కొత్త వెన్యూ నవంబర్ 04న అధికారికంగా లాంచ్ కాబోతోంది. దీంతో, కస్టమర్ల కోసం హ్యుందాయ్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. కస్టమర్లు హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా రూ. 25,000 చెల్లించి కొత్త వెన్యూను రిజర్వ్ చేసుకోవచ్చు.