Karur stampede: చెన్నైతో పాటు తమిళనాడు అంతటా దీపావళి శోభ కనిపిస్తుంటే, తమిళ స్టార్ విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయం నిర్మానుష్యంగా కనిపించింది. ఇటీవల, విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. వీరి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం దీపావళి జరుపుకోవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ కేడర్లు అందరితో పాటు జిల్లా కార్యదర్శులను ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీవీకే కార్యాలయాల్లో చీకటి అలుముకుంది.
Read Also: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో కొత్త పంచాయతీ.. మహా కూటమిలో చీలిక?
సెప్టెంబర్ 27న విజయ్ కరూర్ ర్యాలీకి దాదాపుగా 30,000 మంది మద్దతుదారులు హాజరయ్యారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. మరణించిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. దీని తర్వాత, ఈ విషాదంపై విజయ్ స్పందిస్తూ.. తన హృదయం ముక్కలైందని అని తన బాధను వ్యక్తం చేశారు. భరించలేని బాధను అనుభవిస్తున్నాని, చనిపోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు్న్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఘటన తర్వాత, టీవీకే పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, విజయ్ ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యల కారణంగానే ఈ గందరగోళ సమయంలో మరణాలు సంభవించాయని పేర్కొంది. విజయ్ ర్యాలీకి 4 గంటలు ఆలస్యంగా రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అధికార డీఎంకే ఆరోపిస్తోంది. అధికారులు షరతులను ఉల్లంఘించిన విజయ్, అవసరమైన అనుమతి లేకుండానే రోడ్ షో నిర్వహించడాని ఎఫ్ఐఆర్ పేర్కొంది. అయితే, ఈ ఘటనలో అధికార డీఎంకే కుట్ర ఉందని టీవీకే ఆరోపించింది. మీకు ప్రతీకారం తీర్చుకోవాలంటే, నన్ను ఏదైనా చేయండి కానీ కార్యకర్తల్ని ముట్టుకోవద్దు అని విజయ్, సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి అన్నారు.