Bihar: బీహార్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లిని వీడియో తీసేందుకు వచ్చిన వ్యక్తి ఏకంగా పెళ్లి కొడుకు చెల్లిని లేపుకుపోయాడు. ప్రస్తుతం ఈ వార్త ఆ రాష్ట్రంలో తెగవైరల్ అవుతోంది. ముజఫర్ నగర్‌లో ఓ పెళ్లి వేడుకను చిత్రీకరించేందుకు వచ్చిన యువకుడు వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. ఈ ఘటన అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందవారా ఘాట్ దామోదర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలు అన్నీ పూర్తయిన తర్వాత బాలిక పారిపోయింది.
Read Also: Manchu Manoj: నా భార్య గర్భవతే కానీ.. ఆ వార్తలు నమ్మొద్దు.. మంచు మనోజ్ లేఖ!
మార్చి 4న దీనిపై బాధిత కుటుంబం కేసు నమోదు చేసింది. ఈ ఊహించన పరిస్థితితో ఒక్కసారిగా బంధువులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. బాలిక మైనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులంతా బాలిక కోసం వెతుకుతున్నారు. బాలిక మైనర్ కావడంతో నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మార్చి 4న పెళ్లి ఊరేగింపు మరో ఊరికి వెళ్లనుంది. వేడుకలను కవర్ చేసేందుకు వరుడి బావ తన గ్రామానికి చెందిన ఓ ఫోటోగ్రాఫర్‌ని పిలిపించాడు. అప్పటి వరకు అంతా సజావుగానే జరిగింది, అయితే సాయంత్రం బజార్ వెళ్తున్నా అని చెప్పిన బాలిక ఎంత సేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి, ఇతర కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. రెండు రోజులు వెతికినా బాలిక జాడ తెలియలేదు.
ఆ తర్వాత వరుడి చెల్లి, వీడియోగ్రాఫర్ పారిపోయినట్లు తెలిసింది. మరోవైపు నిందితుడి కుటుంబం మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు. వరుడి చెల్లి కనిపించకుండా పోయిన రోజు నుంచి వీడియోగ్రాఫర్ కూడా కనిపించకుండా పోయాడని గ్రామస్థులు చెబుతున్నారు. నిందితుడు ఒక బాలికతో ఇక్కడి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తమ కుమార్తెని మాయమాటలు చెప్పి లేపుకుపోయిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించాలని బాధిత కుటుంబం కోరుతోంది.