Haryana: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. ఛండీగఢ్‌లో గవర్నర్ బండారు దత్రాత్రేయ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కూడా ఉన్నారు. బీజేపీ-జేజేపీ మధ్య ఎంపీ సీట్ల షేరింగ్‌పై విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రిని మారుస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలలో సీట్ల పంపకం చర్చలు విఫలమైన కారణంగా అధికార బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైన నేపథ్యంలో ఖట్టర్, ఆయన మంత్రివర్గం వైదొలిగింది. పాత మంత్రి వర్గం మొత్తం రాజీనామా చేసింది.
Read Also: Russia: కుప్పకూలిన రష్యా మిలిటరీ కార్గో విమానం.. 15 మంది దుర్మరణం..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
90 మంది శానససభ్యులు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ఆరుగురు ఇండిపెండెంట్లు, హర్యానా లోఖిత్ పార్టీ(హెచ్ఎల్‌పీ)కి చెందిన ఒకరితో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. దీంతో బీజేపీ మెజారిటీ మార్క్ 46ని చేరుకుంటుంది. మరోవైపు జేజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు సమాచారం.
హర్యానాలో 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-జేజేపీ కూటమి అధికారంలోకి వచ్చాయి. అయితే, ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సీట్ల షేరింగ్‌పై విభేదాలు తలెత్తాయి. మొత్తం 10 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేయాలని భావిస్తోంది. అయితే జేజేపీ మాత్రం తమకు 2 స్థానాలు కోటాయించాలని కోరగా.. బీజేపీ ఒక స్థానం ఇస్తామని ప్రతిపాదించింది. 2019లో జేజేపీ ఏడు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయింది. బీజేపీ మొత్తం 10 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ప్రస్తుతం తాము మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తామని జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా భావిస్తున్నారు.
#WATCH | Chandigarh: Independent MLA Ranjit Singh takes oath as minister in the Haryana cabinet. pic.twitter.com/r0PeYfdIq5
— ANI (@ANI) March 12, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!