OTT platforms: అసభ్యకరమై కంటెంట్ ఉన్నందున కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ హెచ్చరికల తర్వాత దేశ వ్యాప్తంగా 18 OTT ప్లాట్‌ఫారమ్‌లు, 19 వెబ్‌సైట్లను, 10 యాప్‌లను, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
కేంద్రం పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ అశ్లీల కంటెంట్‌ని నియంత్రించలేదు. దీంతో గురువారం వీటిని బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ ముసుగులో అశ్లీలత, అసభ్యత, దుర్వినియోగాన్ని ప్రోత్సహించవద్దని ప్లాట్‌ఫారమ్‌లని హెచ్చరించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Read also: Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.3గా నమోదు
ఈ ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్ ప్రధానంగా మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ఇది ఉపాధ్యాయులు-విద్యార్థుల సంబంధాలు, వివాహేతర కుటుంబ సంబంధాలు మొదలైన వాటిపై అనుచితమైన సందర్భాలలో న్యూడిటీ, లైంగిక చర్యలను చిత్రీకరించడం చేస్తున్నట్లు ప్రకటన పేర్కొంది. లైంగిక దూషణలు, కొన్ని సందర్భాల్లో అశ్లీల, లైంగిక అసభ్యకరమైన సుదీర్ఘ దృశ్యాలు ఉన్నట్లు చెప్పింది.
బ్లాక్ చేసిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో డ్రీమ్స్ ఫీల్స్, Voovi, Yessma, Uncut Adda, Tri Flicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix, వంటివి ఉన్నాయి.
Ministry of I&B blocks 18 OTT platforms for obscene and vulgar content after multiple warnings; 19 websites, 10 apps, 57 social media handles of OTT platforms blocked nationwide, says the government. pic.twitter.com/03ojj3YEiF
— ANI (@ANI) March 14, 2024