Supreme Court: టీచర్ బలవంతంగా విద్యార్థినికి ఫ్లవర్స్ ఇవ్వడం లైంగికంగా వేధించడమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: విద్యార్థినికి బలవంతగా పువ్వులు తీసుకోవాలని టీచర్ కోరడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికకు ఇతరుల ముందు పువ్వులు ఇచ్చి, వాటిని తీసుకోవాలని బలవంతం చేయడం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ ఇచ్చే (పోక్సో)చట్టం కిందకు వస్తుందని చెప్పింది. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడి ప్రతిష్టపై సంభావ్య ప్రభావాన్ని గుర్తిస్తూ, సాక్ష్యాధారాలను కఠినంగా పరిశీలించాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెబుతూ, అతనికి విధించిన మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేసి నిర్దోషిగా ప్రకటించింది.
వేధింపులకు గురైన మైనర్ విద్యార్థిని, సాక్షులు ఇచ్చిన సాక్ష్యాధారాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని బెంచ్ గుర్తించింది. టీచర్‌తో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి బాలికను పావుగా వాడుకునే అవకాశంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి అమ్మాయికి చెందిన బంధువులకు, సదరు ఉపాధ్యాయుడికి కొన్ని విషయాలపై వివాదం ఉందని కోర్టు గుర్తించింది. దీంతో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
Read Also: BRS Leaders: భూ కబ్బారాయుళ్లపై సర్కార్ యాక్షన్.. అధిబాట్లలో 38 మందిపై కేసులు..!
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. టీచర్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించిన తమిళనాడు ట్రయల్ కోర్టు, మద్రాస్ హైకోర్టు విధించిన నేరారోపణలను ధర్మాసనం తోసిపుచ్చింది. లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన కేసులలో, ముఖ్యంగా ఉపాధ్యాయుని ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నప్పుడు సమతుల్య నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. సమాజంలో ఆడపిల్లల్ని సురక్షితంగా ఉంచడంలో టీచర్ల పాత్ర కీలకమైనదని వ్యాఖ్యానించింది.
ఒక విద్యార్థిని ఎవరైనా ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుకు గురిచేస్తే అతి తీవ్ర నేరాల జాబితాలో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ తరుపు సీనియర్ న్యాయవాదితో తాము ఏకీభవిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. పాఠశాల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే పోక్సో చట్టం కింద నిబంధనలు అమలులోకి వస్తాయని జస్టిస్ దత్తా తీర్పు చెప్పారు. అయితే, ఉపాధ్యాయుడి ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నప్పుడు, మైనర్ బాలిక పావుగా వాడుకుని ఉపాధ్యాయుడి పరువు తీయడాన్ని అనుమతించకూడదని కోర్టులు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!