Operation Indravati: గ్యాంగ్ వార్‌తో కల్లోలంగా మారిన హైతీ దేశం నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం ‘‘ఆపరేషన్ ఇంద్రావతి’’ని ప్రారంభించింది. కరేబియన్ దేశమైన హైతీలో సాయుధ ముఠాలు అక్కడి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశంలో ఉన్న భారతీయులను సమీపంలో డొమినికన్ రిపబ్లిక్‌కి తరలించేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
Read Also: Elephant Attack: జరైతే ప్రాణాలు పోయేవే.. టూరిస్టుల వాహనాన్ని ఎత్తిపారేసిన ఏనుగు.. వైరల్ వీడియో..
ప్రస్తుతం హైతీలో ప్రభుత్వం లేకుండా ఉంది. సాయుధ ముఠాలు వీధుల్లోకి వచ్చి, అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. గ్యాంగ్ స్టర్, బార్బెక్యూగా ప్రసిద్ధి చెందిన జమ్మి చెరిజియన్ నేతృత్వంలోని సాయుధ ముఠాలు హైతీని హస్తగతం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న 12 మంది భారతీయులను సురక్షితంగా గురువారం తరలించారు. హింసతో అట్టుడుకుతున్న హైతీలో పరిస్థితులను సమీక్షించి, భారతీయులను అక్కడి నుంచి తరలిస్తామని మార్చి 15న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు. ప్రస్తుతం హైతీ రాజధానిలో 80 శాతం ముఠా నియంత్రణలోకి వెళ్లింది.