PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు సందేశ్‌ఖాలీ బాధితురాలు, బీజేపీ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖా పాత్రకి ఫోన్ చేసి మాట్లాడారు. బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బీజేపీ తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది. సందేశ్‌ఖాలీలో ప్రజల మానసిక పరిస్థితి గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. రేఖా పాత్రను ‘శక్తి స్వరూపిణి’గా ప్రధాని మోడీ అభివర్ణించారు. సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళల బాధల్ని, తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకులు వేధింపుల గురించి రేఖ ప్రధానికి తెలిపారు.
Saudi Arabia: సంప్రదాయ ఇస్లామిక్ దేశంగా పేరున్న ‘సౌదీ అరేబియా’ తన ఛాందసవాదాన్ని నెమ్మదిగా వదులుకుంటోంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నెమ్మదిగా ఆ దేశంలో మార్పులు వస్తున్నాయి. గతంలో మహిళా హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేని ఆ దేశంలో ఇప్పుడు ఏకంగా ఓ మహిళ దేశం తరుపున ‘‘మిస్ యూనివర్స్’’ పోటీల్లో పాల్గొనబోతోంది.
Bengaluru Water Crisis: బెంగళూర్ నగరం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఎన్నడూ లేని విధంగా నగర ప్రజలు నీటికి అల్లాడుతున్నారు. దశాబ్ధ కాలంలో ఇలాంటి నీటి ఎద్దడిని నగరం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇదిలా ఉంటే నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రజలకు జరిమానాలు విధిస్తున్నారు.
Udhayanidhi Stalin: ప్రధాని నరేంద్రమోడీని ఇంటికి సాగనంపే వరకు మేము నిద్రపోము అని డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ డీఎంకు, ఇండియా కూటమిని ఉద్దేశించి విమర్శలు చేశారు.
Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టు ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టుపై అమెరికా స్పందించింది.
Heatwave: వేసవి ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మాసం రాకముందే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో ఓటర్ల భద్రత కోసం లోక్‌సభ ఎన్నికల ముందు భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఈరోజు కీలక సూచనలు జారీ చేసింది.
Geomagnetic Storm: సూర్యుడి నుంచి ఏర్పడిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ భూమిని తాకింది. గత 6 ఏళ్లలో భూమిని తాకిన అతిపెద్ద ‘‘భూ అయస్కాంత తుఫాను’’గా శాస్త్రవేత్తలు దీనిని పేర్కొన్నారు. ఈ సౌర తుఫాన్ ఆదివారం భూ వాతావరణాన్ని ఢీకొట్టింది. భూ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగించింది. NOAA యొక్క స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Varun Gandhi: బీజేపీ నేత వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతోంది. తమ పార్టీలో చేరాలని సూచిస్తోంది. ఇటీవల బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల 5వ జాబితాలో వరుణ్ గాంధీని తప్పించింది.
IPL Betting: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది. మరోవైపు బెట్టింగ్ కూడా జోరుగా నడుస్తోంది. గతంలో బెట్టింగులకు పాల్పడి కోట్లలో డబ్బును కోల్పోయి, చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశాము. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన దర్శన్ బాబు అనే ఇంజనీర్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు.
Varun Gandhi: వరుణ్ గాంధీకి బీజేపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం నేపథ్యంలో.. తాజాగా ప్రకటించిన 5వ జాబితా అభ్యర్థుల్లో ఆయన పేరు లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ పిలిభిత్ నుంచి ఎంపీగా ఉన్న వరణ్ గాంధీ స్థానాన్ని కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాదకు కేటాయించింది.