Hurun rich list: హురన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు అమెరికాలోని న్యూయార్క్‌లోనే నివసిస్తున్నారు. అయితే, ఆసియాలో మాత్రం బిలియనీర్లకు కేంద్రంగా ముంబై తొలిస్థానంలో ఉంది. చైనా రాజధాని బీజింగ్‌ని వెనక్కి నెట్టి ముంబై ఈ ఘనత సాధించింది
Arvind Kejriwal arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఈ అరెస్ట్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను పిలిచింది. 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది.
Sonam Wangchuk: లడఖ్ రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మంగళవారం లేహ్‌లో తన నిరాహార దీక్షను విమరించారు. మైనర్ బాలిక ఇచ్చిన నిమ్మరసాన్ని తాగి నిరాహార దీక్షను విరమించారు.
Jaishankar: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా దుందుడుకు వేషాలు ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతంలో సర్వాధికారాలు మావే అంటూ ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం వంటి దేశాలను చైనా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల రెండు సందర్భాల్లో ఫిలిప్పీన్స్ నౌకలపై చైనా కోస్టుగార్డ్స్ నౌకలు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతంతో మిత్రదేశం ఫిలిప్పీన్స్‌కి అండగా నిలుస్తామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. చైనా వైఖరిని ఖండించింది.
Youtube: యూట్యూబ్ తన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఇండియాలో ఏకంగా 2.25 మిలియన్ల(22,54,902) వీడియోలను తొలగించింది.
Baltimore Bridge collapse: అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటైన బాల్టిమోర్ సమీపంలో కార్గో షిప్ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో వంతెన కుప్పకూలింది. ఈ ఘటన జరిగే సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కార్లు, అందులోని ప్రయాణికులు చల్లటి నీటిలో పడిపోయారు. వీరి కోసం రెస్క్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 948 అడుగుల కంటైనర్ షిప్ సింగపూర్ ఫ్లాగ్ కలిగిన డాలీ ఒక్కసారిగా వంతెనను ఢీకొట్టడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Layoffs: టెక్ సంస్థల్లో ఉద్యోగాల లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లుగా ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అని టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లో పాటు చిన్నాచితకా కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక అస్థిరత కారణంగా ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనలతో సంస్థలు ఉద్యోగులను తీసేస్తున్నాయి.
PM Modi: శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ)కి బీజేపీ ఫిర్యాదు చేసింది. పీఎంని కించపరిచే విధంగా ఇద్దరు నేతలు వ్యాఖ్యలు చేశారని మంగళవారం ఫిర్యాదు చేశారు. విదర్భ ప్రాంతంలోని బుల్దానాలో జరిగిన ర్యాలీలో సంజయ్ రౌత్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీని ఔరంగజేబులో పోల్చారు. తమిళనాడు పశుసంవర్థక శాఖ మంత్రి అని రాధాకృష్ణన్ రాష్ట్రంలో జరిగిన ఓ సభలో ప్రధానిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.
DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.