IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్‌తో రూ. కోటికిపైగా అప్పులు.. భార్య ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Betting: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది. మరోవైపు బెట్టింగ్ కూడా జోరుగా నడుస్తోంది. గతంలో బెట్టింగులకు పాల్పడి కోట్లలో డబ్బును కోల్పోయి, చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశాము. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన దర్శన్ బాబు అనే ఇంజనీర్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు. 2021 నుంచి ఐపీఎల్ బెట్టింగ్‌లు వేస్తున్నాడు. దీని కోసం అప్పులు కూడా చేశాడు. ఇదిలా ఉంటే ఇలా అప్పులు ఎక్కువ కావడంతో రుణదాతల నుంచి నిత్యం వేధింపులు ఎదుర్కొంటోన్నాడు.
Read Also: IPL 2024: ఆర్‌సీబీ ఆటగాడిపై భారత మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు.. గట్టిగా ఇచ్చిపడేసిన బెంగళూరు ఫ్రాంచైజీ!
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
వేధింపులతో విసిగిపోయిన దర్శన్ బాబు భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 23 ఏళ్ల రంజిత కర్ణాటక చిత్రదుర్గలో తన ఇంట్లో మార్చి 18న ఉరేసుకుని కనిపించింది. భర్త దర్శన్ హోసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేశాడు. 2021-2023 మధ్య ఐపీఎల్ బెట్టింగ్‌లో ఇరుక్కున్నాడు. దీంతో దంపతుల సంసారంలో అప్పులు మనస్పర్థలకు దారితీశాయి. దాదాపుగా రూ. 1.5 కోట్లకు పైగా రుణం తీసుకున్నాడని తెలిసింది. రూ. 1 కోటి అప్పు తీర్చగా.. మరో రూ. 84 లక్షల రుణం పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దర్శన్, రంజితలు 2020లో వివాహం చేసుకున్నారు. దర్శన్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న నిజాన్ని 2021లో రంజిత తెలుసుకున్నట్లు ఆమె తండ్రి వెంకటేష్ తెలిపాడు. వడ్డీ వ్యాపారుల నుంచి నిత్యం వేధింపుల వల్ల తన కుతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పు ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా అతను పేర్కొన్నాడు. త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశను చూపి తన అల్లుడిని ట్రాప్ చేసినట్లు ఆయన పేర్నొన్నాడు. పోలీసులు తమ విచారణలో సూసైడ్ నోట్‌ని కనుగొన్నారు. దర్శన్, రంజితలకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!