Geomagnetic Storm: సూర్యుడి నుంచి ఏర్పడిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ భూమిని తాకింది. గత 6 ఏళ్లలో భూమిని తాకిన అతిపెద్ద ‘‘భూ అయస్కాంత తుఫాను’’గా శాస్త్రవేత్తలు దీనిని పేర్కొన్నారు. ఈ సౌర తుఫాన్ ఆదివారం భూ వాతావరణాన్ని ఢీకొట్టింది. భూ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగించింది. NOAA యొక్క స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
సూర్యుడి నుంచి ఏర్పడే శక్తివంతమైన పేలుళ్ల కారణంగా ఈ సౌర జ్వాలలు అంతరిక్షంలోకి వెదజల్లబడుతాయి. ఇవి భూ వాతావరణాన్ని ఢీకొన్న సమయంలో ‘‘భూ అయస్కాంత తుఫాను’’గా పిలుస్తారు. ఇది భూమి అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ సమయంలో రేడియో ప్రసారాలు, విద్యుత్ గ్రిడ్లు ప్రభావితం అవుతాయి. ధృవాల వద్ద కాంతివంతమైన అరోరాలను ఏర్పరుస్తాయి.
Read Also: Varun Gandhi: “మాతో చేరడానికి వరుణ్ గాంధీకి స్వాగతం”.. కాంగ్రెస్ ఆఫర్..
కరోనల్ మాస్ ఎజెక్షన్(CME)గా పిలువబడే ఈ సౌరజ్వాలలు అత్యంత ఆవేశిత కణాలను కలిగి ఉంటాయి. అయితే, భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం ఈ సౌర జ్వాలలను అడ్డుకుని, భూమిపై ఉండే జీవజాలాన్ని రక్షిస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో అంతరిక్షంలోని శాటిలైట్లపై ప్రభావం చూపిస్తుంది. సౌర జ్వాల భూమిని ఢీకొట్టే సమయంలో శాటిలైట్లను సేఫ్ మోడ్‌లో ఉంచడం ద్వారా శాస్త్రవేత్తలు వీటిని రక్షిస్తుంటారు.
ప్రస్తుతం సూర్యుడు తన ‘‘సోలార్ సైకిల్’’ అనే పిలువబడే ప్రక్రియలో ఉన్నాడు. ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు మారుతాయి. అంటే, దక్షిణ ధృవం ఉత్తరంగా, ఉత్తర ధృవం దక్షిణంగా మారుతుంటుంది. ఈ ప్రక్రియ కారణంగా సూర్యుడి గురుత్వాకర్షణ శక్తిలో తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. పలు ప్రాంతాల్లో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండీ బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతుంటాయి. ఉన్నట్టుండి ఈ ప్రాంతాల్లో నుంచి భారీ పేలుళ్లు సంభవిస్తుంటాయి, సౌర జ్వాలలు ఎగిసి పడి ఇలా భూమి వైపు వస్తుంటాయి.
The G3 (Moderate) geomagnetic storm watch remains in effect. However, conditions are showing signs of weakening. G3 watch remains active until the end of the UT day, then lessening impacts expected to G1 (Minor) storm levels. Stay tuned to our website for updates and changes. pic.twitter.com/umLuq1aFCk
— NOAA Space Weather Prediction Center (@NWSSWPC) March 25, 2024