Mahindra XUV 3XO: మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్ ఏప్రిల్ 29న ముందుకు రాబోతోంది. పూర్తిగా కొత్త పేరులో, మరిన్ని ఫీచర్లలో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా స్టైలిష్ లుక్స్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ‘మహీంద్రా XUV 3XO’గా వస్తోంది. దేశీయ దిగ్గజ కార్ మేకర్ అయిన మహీంద్రా నుంచి ఇప్పటికే మహీంద్రా బొలెరో, మహీంద్రా బొలెరో నియో, మహీంద్రా థార్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్, మహీంద్రా స్కార్పియో-N మరియు మహీంద్రా XUV700 ఉన్నాయి.
ఇండియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో XUV 3XO ఉండబోతోంది. దీంతో ఈ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరగనుంది. సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లీడర్ టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సోనెట్‌లతో ఆ కార్ పోటీ పడనుంది.
మరింత స్టైలిష్‌గా:
కొత్తగా రాబోతున్న మహీంద్రా XUV 3XOలో పూర్తిగా ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్ మరింత ఆధునాతనంగా ఉండబోతున్నాయి. రీడిజైన్ చేయబడిన గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు, LED ఫాగ్ ల్యాంప్స్‌తో పాటు 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో రాబోతోంది. వెనుకవైపు, మహీంద్రా లోగో క్రింద XUV 3XO బ్యాడ్జింగ్‌తో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ ఉండబోతోంది.
ప్రస్తుతం ఉన్న మహీంద్రా XUV300 క్యాబిన్ అవుట్‌డేటెడ్‌గా ఉంది. దీంతో కొత్తగా రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఇంటిగ్రేటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లతో కూడిన రిచ్ క్యాబిన్ ఉండనుంది.
ప్రస్తుతం ఇండియాలో ఉన్న సేఫెస్ట్ కార్లలో ఒకటిగా XUV300 ఉంది. గ్లోబల్ NCAP రేటింగ్స్ ప్రకారం 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. పిల్లలతో పాటు పెద్దలకు రక్షణ విషయంలో మేటిగా ఉంది. ప్రస్తుతం రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా అంతే సురక్షితంగా ఉండనుంది. 4 డిస్క్ బ్రేకులు, 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.
ఇంజన్ ఆఫ్షన్స్, ధర:
మహీంద్రా XUV300 మూడు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. టర్ టర్బోచార్జ్డ్ మల్టీపాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (TCMPFI) పెట్రోల్ (110PS/200Nm), 1.2-లీటర్ mStallion టర్బోచార్జ్డ్ ఇంటర్‌కూల్డ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ (TGDi) పెట్రోల్ (130NmPS/230NmPS/230.), 1.5 లీటర్ డిజిల్ ఇంజన్లను కలిగి ఉంది. TCMPFI మరియు డీజిల్ ఇంజిన్‌లు 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AMT ఎంపికలను కలిగి ఉండగా, TGDi కేవలం 6-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌ని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ పవర్ ట్రెయిన్లను మహీంద్రా XUV 3XOకి అన్వయించే అవకాశం ఉంది. మహీంద్రా XUV300 ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 14.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, మహీంద్రా XUV 3XO ధర రూ. 8.50 లక్షల నుండి రూ. 15.50 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చని అంచనా.