S Jaishankar: ఇది మోడీ గ్యారెంటీ.. లావోస్‌లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా స్వదేశానికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న భారతీయులను భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. ఉద్యోగాల పేరుతో ఆగ్నేయాసియా దేశమైన లావోస్‌లో 17 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరందరిని భారత్‌కి తీసుకువచ్చారు. దీనిపై విదేశాంగమంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. ఇది ‘‘ మోడీ గ్యారెంటీ’’ అని అన్నారు. లావోస్‌లో భారత రాయబార కార్యాలయాన్ని జైశంకర్ ప్రశంసించారు. లావోస్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ వేదికగా జైశంకర్..‘‘ మోడీ గ్యారెంటీ స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా పనిచేస్తుంది. లావోస్ అసురక్షిత, చట్టవిరుద్ధమైన పనిలో చిక్కుకున్న 17 మంది భారతీయ కార్మికులు స్వదేశానికి తిరిగి వచ్చారు’’ అని ట్వీట్ చేశారు.
Read Also: X Blue Tick: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇకపై వారికి ‘బ్లూ టిక్’ కు నో పేమంట్స్..!
Also Read
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
లావోస్ భారత రాయబార కార్యాలయం చాలా బాగా పనిచేసిందని, లావోస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కంబోడియాలో లాభదాయకమైన ఉద్యోగావకశాలు కల్పిస్తామని వాగ్దానం చేస్తూ మానవ అక్రమ రవాణాదారుల బారిన పడకుండా భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం హెచ్చరించింది. ఆయా దేశాల్లో ఉద్యోగవకాశాల కోసం వెతుకుతున్న భారతీయులు, తమ యజమాని నేపథ్యాన్ని క్షణ్ణంగా తనిఖీ చేయాలని మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది. కంబోడియాలో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!