Venu Goapl Reddy
Author- NTV Telugu-
Bashar al-Assad: విమాన ప్రమాదంలో సిరియా అధ్యక్షుడి మృతి..?
Bashar al-Assad: సిరియాలో గత 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇస్లామిక్ గ్రూప్ హయతర్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని రెబల్స్ రాజధాని డమాస్కస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్ వంటి నగరాలను, పట్టణాలను కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, రెబల్స్ ధాటికి తట్టుకోలేక రష్యన్, సిరియన్ బలగాలు పారిపోతున్నాయి. -
Sharad Pawar: బీజేపీ కూటమి గెలుపు తర్వాత మహారాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా లేరు..
Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలవడంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి గెలవడంపై మహారాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం లేదని, ఆనందం కనిపించడం లేదని శరద్ పవార్ శనివారం అన్నారు. కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. Read Also: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్ […] -
S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్ ప్రకటన..
అమెరికన్ డాలర్‌కి పోటీగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేయాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల రష్యా వేదిక జరిగిన బ్రిక్స్ సమావేశం తర్వాత ‘‘బ్రిక్స్ కరెన్సీ’’ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. వర్థమాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్, రష్యా వంటి బ్రిక్స్ కూటమి దేశాలు ఈ కరెన్సీపై కసరత్తు చేస్తున్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు […] -
Bangladesh: పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్‌కి సెక్యూరిటీ సమస్య..
Bangladesh: బంగ్లాదేశ్ రోజురోజుకు భారత్‌తో వైరం పెట్టుకోవాలని తహతహలాడుతోంది. అందుకు ఆ దేశం తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అకృత్యాలు కొనసాగిస్తూ, భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తన సరిహద్దుల్లో బైరెక్టర్ డ్రోన్లను మోహరించింది. -
INDIA Alliance: ఇక ఇండియా కూటమి సంగతి అంతేనా.. కాంగ్రెస్‌కి ‘హ్యాండ్’ ఇస్తున్న మిత్రులు..
INDIA Alliance: 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒకింత బీజేపీని అడ్డుకోగలిగింది . కానీ, అధికారంలోకి రాకుండా ఆపలేకుండా పోయింది. కూటమిగా బీజేపీ వ్యతిరేక పక్షాలు కాస్త సక్సెస్ అయినట్లే కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకోవడం ఊరటనిచ్చే అంశం. కాంగ్రెస్ గత వైభవాన్ని దక్కించుకుంటుందని అంతా రాజకీయ విశ్లేషకులు, మీడియా కథనాలు అంచనా వేశాయి. తీరా.. షరా మమూలే అన్న రీతిలో కాంగ్రెస్ పరాజయాలు […] -
Delhi: “అక్రమ బంగ్లాదేశీయుల్ని పంపించేయండి”.. ఎల్జీని కోరిన ముస్లిం మతగురువులు..
Delhi: బంగ్లాదేశ్ హిందువులపై అకృత్యాలు జరుగుతున్న నేపథ్యంలో హజ్రల్ నిజాముద్దీన్ దర్గా ప్రాంతంలోని మతపెద్దలు, నివాసితుల ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అయ్యారు. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను గుర్తించి స్వదేశానికి పంపించేందుకు స్పెషల్ డ్రైవ్‌ని చేపట్టాలని కోరినట్లు రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
PM Modi: ప్రధాని మోడీని చంపేస్తామని బెదిరింపులు..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామని ముంబై పోలీసులకు శనివారం బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. అజ్మీర్‌కి చెందిన ఓ నెంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు గుర్తించామని, నిందితుడిని పట్టుకునేందుకు అక్కడికి పోలీస్ టీంలను పంపామని అధికారి తెలిపారు. -
Mahindra BE 6e: మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ ‘‘BE 6e’’ పేరుని ‘‘BE 6’’గా మార్చింది.. ఇండిగో వివాదంతో నిర్ణయం..
Mahindra BE 6e: స్వదేశీ కార్ మేకర్ మహీంద్రా ఇటీవల తన ప్లాన్షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మహీంద్రా BE 6E, XEC 9E కార్లను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు BE 6E పేరు వివాదాస్పదంగా మారింది. కారు పేరులో ‘6E’ని వాడినందుకు, దేశంలో అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో కేసు పెట్టింది. దీనిని కారు పేరులో వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, శనివారం మహీంద్రా.. మహీంద్రా BE 6e’ని ‘మహీంద్రా […] -
Mayawati: బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణం.. ఇప్పుడు ముస్లిం ఓట్ల కోసం..
Mayawati: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పందించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆమె.. రాజ్యాంగ సభకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్‌ని ఎన్నుకున్నందుకు శిక్షగా, హిందూ మెజారిటీ ప్రాంతం అయినప్పటికీ కాంగ్రెస్ బెంగాల్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చిందని ఆరోపించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌లో భాగమైందని చెప్పారు. -
Man Kills Mother: నచ్చిన అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోవడం లేదని తల్లి హత్య..
Man Kills Mother: తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లినే హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 22 ఏళ్ల యువకుడు తాను ఎంచుకున్న మహిళను పెళ్లి చేసుకోవడానికి తల్లి నిరాకరించింది. తన ఆస్తిపై వారసత్వాన్ని కోల్పోతావని తల్లి బెదిరించడంతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడని అరెస్ట్ చేసిటనట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడిని సావన్ అనే వ్యక్తిగా గుర్తించారు. మొదట్లో ఈ నేరాన్ని దోపిడిగా చిత్రీకరించే పనిచేశాడు.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!