Venu Goapl Reddy
Author- NTV Telugu-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘దేశద్రోహి’,‘సోరోస్ ఏజెంట్’.. దూషించిన బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దూషిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ శుక్రవారం ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రలపై సభాహక్కుల తీర్మానాన్ని తీసుకువచ్చారు. పార్లమెంట్ నడపకుండా చేసే కుట్రలో ఇదొక భాగమని, వారు అదానీ ఇష్యూకి భయపడి దాని నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. -
Kerala High Court: మలయాళ యాక్టర్ దిలీప్ శబరిమల వీఐపీ దర్శనం..హైకోర్టు ఆగ్రహం..
Kerala High Court: మలయాళంలో వివాదాస్పద నటుడు, 2017లో నటి లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న యాక్టర్ దిలీప్ శబరిమల దర్శనం వివాదాస్పదమైంది. -
Nobel Prize: మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’.. నోబెల్ అవార్డుని పున:పరిశీలించాలి..
Nobel Prize: బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ.. బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఆయన హయాంలో బంగ్లాదేశ్ హిందువుల, ఇతర మైనారిటీలపై జరుగుతున్న తీవ్ర అఘాయిత్యాలు, అకృత్యాలను పరిష్కరించాలని మహతో తన లేఖలో నోబెల్ కమిటీని కోరారు. -
Bangladesh: హిందువులపై ఆగని దాడులు.. మైనారిటీ హక్కుల సంఘం ఆందోళన..
డిసెంబర్ 03 రాత్రి మంగ్లార్గావ్, మోనిగావ్ ఈస్ట్ గునిగ్రామ్లలో హిందూ సమాజానికి చెందిన వారిపై గుంపు దాడికి పాల్పడింది. 100 కన్నా ఎక్కువ ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేశారు. షాపుల్ని లూటీ చేశారు. ఒక ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మొత్తం 1.5 మిలియన్ టాకా( రూ. 10లక్షల)కు పైగా నష్టం వాటిల్లినట్లు కౌన్సిల్ వెల్లడించింది. -
Devendra Fadnavis: కాంగ్రెస్ ‘ఈవీఎం’ ఆరోపణలు.. ‘లాతూర్’ ఉదాహరణ చెప్పిన సీఎం ఫడ్నవీస్
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణంగా ఓడిపోయింది. 288 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ కూటమి కేవలం 46 స్థానాలు మాత్రమే గెలిచింది. మరోవైపు బీజేపీ కూటమి మహాయుతి ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. -
Supreme Court: మీరు ‘‘నార్కోస్’’, ‘‘బ్రేకింగ్ బ్యాడ్’’ సిరీస్‌లను చూశారా.? నిందితుడికి బెయిల్ నిరాకరణ..
Supreme Court: డ్రగ్స్ కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద నమోదైన కేసులో నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిందితుడి తరుఫున వాదించిన న్యాయవాది.. సదరు వ్యక్తి సమాజానికి గణనీయమైన ప్రమాదం కలిగించలేదని, అతడి అరెస్ట్ అనవసరమని సుప్రీంకోర్టుకు వెల్లడించారు. -
Earthquake: 55 ఏళ్లలో తెలంగాణలో రెండో అతిపెద్ద భూకంపం.. కారణాలేంటి..?
Earthquake: బుధవారం ములుగు జిల్లాలో సంభవించిన భూకంపంతో తెలంగాణ ఒక్కసారిగా వణికిపోయింది. తెల్లవారుజామున 7.27 గంటలకు ములుగులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 40 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం సమీపంలోని మంచిర్యాల, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు కనిపించాయి. -
CAPF: పారామిలిటరీలో పెరిగిన ఆత్మహత్యలు, 100 రోజుల లీవ్ పాలసీతో ఉపశమనం: హోం మినిస్ట్రీ..
CAPF: ఎక్కువ గంటలు డ్యూటీ చేయడం, నిద్రలేమి కారణంగా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, సర్వీస్ పూర్తి కాకముందే స్వచ్ఛంద పదవీ విరమణ కూడా చేస్తున్నారు. 730 మంది జవాన్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, 55,000 మందికి పైగా రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభలో చెప్పింది. -
Eknath Shinde: డిప్యూటీ సీఎంపై తేల్చని షిండే.. అజిత్ పవార్‌పై చురకలు..
Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. రేపు సాయంత్రం 5.30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఎన్డీయే నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ రాధాకృష్ణన్‌కి కలిసిన మహాయుతి నేతలు, ప్రభుత్వ ఏర్పాటును కోరారు. -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయాణికుల నినాదాలు.. కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ..
Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. సర్వేకు వచ్చిన అధికారులు, పోలీసులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఇది మొత్తం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!