Priyanka Gandhi: మహాత్ముడి చివరి మాట ‘హే రామ్’.. కాంగ్రెస్ ఎలా హిందూ వ్యతిరేకి అవుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం తన పార్టీ ‘‘హిందూ వ్యతిరేకం’’ అని వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 1948లో నాథూరామ్ గాడ్సే చేత కాల్చి చంపబడినప్పుడు మహాత్మా గాంధీ చివరి మాటలు ‘హేరామ్’ అని చెప్పారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్‌కి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు సహకారాన్ని ఆమె గుర్తు చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌పై హిందూ వ్యతిరే ముద్ర వేసిందని, మా పార్టీ అతిపెద్ద నాయకుడు మహాత్మా గాంధీ అని, సత్యం, అహింసా, సత్యవేవ జయతే అనే విధానంపై స్వాతంత్య్ర పోరాటం ఆధారపడిందని ఆమె చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం చాలా మంది ప్రాణత్యాగం చేశారని, గాంధీకి బుల్లెట్ గాయాలైన సందర్భంలో హేరామ్ అన్నారని, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ ఎలా అవుతుంది..? అని ఆమె ప్రశ్నించారు. రామ మందిర కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకాకపోవడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
Read Also: Palnadu: పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియామకం.. ఈసీ ఉత్తర్వులు
ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లు, సంపద పంపిణీపై కాంగ్రెస్ మానిఫెస్టో, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ వాటిని ఆస్త్రాలుగా మలుచుకుంది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని, బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ దుయ్యబడుతోంది. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించిందని బీజేపీ ధ్వజమెత్తుతోంది.
‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకకు బీజేపీకి ఆహ్వానం అందిందని, అందుకే ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకకు హాజరుకావడం తప్పుడు నిర్ణయమని చెప్పడం సరికాదని, ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆమె అన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన ప్రియాంకా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ ‘మోదీ కి గ్యారెంటీ’ నినాదంపై విరుచుకుపడ్డారు. మతాలకు అతీతంగా తమ వాగ్దానాలు ఉంటాయని చెప్పారు.
తాజావార్తలు
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!