Himanta Biswa Sarma: ‘‘ముస్లింలకు పూర్తిగా రిజర్వేషన్లు కల్పించాలని’’ ఇటీవల ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించానుకునే వారు పాకిస్తాన్ వెళ్లి అక్కడ రిజర్వేషన్లు కల్పించాలని లాలూకూ సూచించారు. శనివారం బీహార్ రాష్ట్రంలోని సివాన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం లలాలూ యాదవ్ ప్రకటన చూశాను, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు, హిందువులకు రిజర్వేషన్లు పొందే అర్హత లేదా అని హిమంత ప్రశ్నించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారని, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఉంటాయని, ఇందులో ముస్లిం రిజర్వేషన్లకు అనుమతించమని, ఇది కోరే వారు పాకిస్తాన్ వెళ్లండని, ఇది భారత్‌లో ఎప్పటికీ జరగదని ఆయన అన్నారు.
Read Also: Uttar Pradesh: పోలీసుల సాయం కోసం వచ్చిన ప్రేమజంట.. చివరకు ఏమైందంటే..?
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉదాహరణలను ప్రస్తావిస్తూ, ఇలాంటి చర్యలు ఇతర వెనబడిన తరగతుల వారికి నష్టం కలిగించాయని అస్సాం సీఎం ఆరోపించారు. వెనకబడిన తరగతుల వారి రిజర్వేషన్లను దోచుకుని కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేశారని ఆయన అన్నారు. పీఓకేని భారత్‌లో కలపాలంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 400 సీట్లు ఇవ్వాలని ప్రజల్ని కోరారు. అస్సాంలో 700 మదర్సాలను మూసేశామని, దానికి వ్యతిరేకంగా ఎవరూ నోరు మెదపలేదని దీని కారణం ఇది కొత్త భారత్ అని ఆయన వ్యాఖ్యానించారు. యూనిఫాం సివిల్ కోడ్, శ్రీ కృష్ణ జన్మభూమి, జ్ఞానవాపి ఆలయాలను నిర్మించాలంటే మాకు 400 సీట్లు కావాలి అని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల పరంగా అత్యంత కీలక రాష్ట్రంగా బీజేపీ ఉంది. గతంలో 2019 ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ కూటమి ఏకంగా 39 సీట్లను సాధించింది. ఈ సారి మరోసారి ఈ రెండు పార్టీలతో పాటు చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), జితన్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) ఎన్డీయే కూటమిలో భాగంగా పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయగా, ఎల్జేపీ 5, హెచ్ఏఎం, రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కోస్థానంలో పోటీలో ఉన్నాయి.