Venu Goapl Reddy
Author- NTV Telugu-
Iran: హిజాబ్ ధిక్కరిస్తే మహిళలకు ఉరిశిక్ష.. ఇరాన్లో కొత్త చట్టాలు..
Iran: ఇరాన్‌లోని మత ప్రభుత్వం మహిళ హక్కుల్ని మరింతగా దిగజార్చే కొత్త చట్టాలను తీసుకువచ్చింది. మహిళలు హిజాబ్ వంటి నైతిక చట్టాలను కఠినంగా పాటించేందుకు ఈ చట్టాలను తీసుకువచ్చింది. ఒక వేళ వీటిని ధిక్కరిస్తే మరణశిక్ష లేదా 15 ఏళ్ల వరకు జైలుశిక్షతో సహా కఠినమైన శిక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
Priest Suicide: కాళీ దేవీ దర్శనం ఇవ్వలేదని పూజారి ఆత్మహత్య..
Priest Suicide: కాళీమాత తనకు దర్శనం ఇవ్వలేదని ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. 24 గంటల పాటు ప్రార్థన నిర్వహించినా కాళీమాత తనకు కనిపించలేదని 45 ఏళ్ల పూజారి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం గైఘాట్ పతంగలిలోని తన అద్దె నివాసంలో అమిత్ శర్మ గొంతు కోసుకున్నాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతను మరణించారు. -
Section 498A: భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య.. వరకట్న చట్టాలపై చర్యలకు లాయర్ల డిమాండ్..
Section 498A: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్యతో పాటు ఆమె కుటుంబం వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నారు. తాను నిర్దోషినని అయినా కూడా న్యాయవ్యవస్థ ఆమెకే అనుకూలంగా ఉందని చెబుతూ 20 పేజీల లేఖ రాయడంతో పాటు 80 నిమిషాల వీడియోలో తాను అనుభవించిన వేధింపులను చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. -
Low Fertility Rate: వారానికి 4 రోజులే పని..సంతానోత్పత్తిని పెంచేందుకు జపాన్ కీలక నిర్ణయం..
Low Fertility Rate: చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ‘‘తక్కువ సంతానోత్పత్తి’’ ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దేశ ప్రజలు వివాహాలకు , పిల్లలు కనడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇటీవల కాలంలో తక్కువ జననాలు నమోదవుతుండటం ఆ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జపాన్‌లో సంతానోత్పత్తి రేటు చాలా ఏళ్ల తర్వాత జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో తగ్గిపోయింది. -
Atala Mosque Row: “అటాలా మసీదు కాదు, ఆలయం”.. కోర్టుకు చేరిన వివాదం..
ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని మరో మసీదు కూడా వివాదస్పదమైంది. జౌన్‌పూర్‌లోని ‘‘ అటాటా మసీదు’’ అంశం న్యాయస్థానంలో ఉంది. ఈ మసీదు హిందూ ఆలయమని కన్నౌజ్ రాజు విజయ్ చంద్ర ‘‘అటలా దేవి ఆలయం’’ నిర్మించారని హిందూ పక్షం చెబుతోంది. 14వ శతాబ్ధంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడని, -
Instagram Reels: ఇన్స్టాగ్రామ్ పిచ్చి.. పిల్లల ముందే భార్య దారుణ హత్య..
Instagram Reels: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్ల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌కి బానిస కావడం వల్లే భర్త హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం, దానికి కామెంట్స్ రావడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడంతోనే సదరు వ్యక్తి, తన భార్యని చంపేశాడు. -
Bangladesh: చిన్మోయ్ కృష్ణదాస్‌కి మరోసారి బెయిల్ నిరాకరించిన బంగ్లా కోర్టు..
Bangladesh: బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటేకి నాయకత్వం వహిస్తున్న హిందూ మతపెద్ద చిన్మోయ్ కృష్ణదాస్‌ని బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దోశద్రోహ కేసును ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం జైలులు ఉన్నారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి ఆయన బెయిల్ పిటిషన్‌ని అక్కడి కోర్టులు తిరస్కరించాయి. ఇప్పటికే ఒకసారి ఆయన బెయిల్ పిటిషన్‌ని బంగ్లాకోర్టులు పట్టించుకోలేదు. చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎండీ సైఫుల్ ఇస్లాం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాస్ తరుపున […] -
Suvendu Adhikari: బెంగాల్లో 40 రాఫెల్స్, బంగ్లాదేశ్‌కి 2 చాలు.. సువేందు వార్నింగ్..
Suvendu Adhikari: బీజేపీ నాయకుడు, బెంగాత్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి బంగ్లాదేశ్‌కి వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువుల అణిచివేతపై ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్‌కి 2 రాఫెల్ విమానాలు సరిపోతాయని అన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బసిర్హాట్లో బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఘోజదంగాలో బంగ్లాదేశ్‌లో హిందువులపై మతపరమైన హింసను ఖండిస్తూ నిరసన తెలిపారు. -
M Jethamalani: జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్, సోనియా గాంధీ అపవిత్ర బంధం..
M Jethamalani: సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కాశ్మీర్‌ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది. -
live-in relationship: “కలిసి జీవిస్తే, పోలీసులు రక్షణ ఎందుకు..?” మతాంతర జంటపై కోర్టు ఆగ్రహం..
live-in relationship: లివ్ ఇన్ రిలేషన్ కొనసాగించడానికి పోలీసుల రక్షణ కోసం పిటిషన్ దాకలు చేసిన జంటపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. కలిసి జీవించేందుకు పోలీసులు రక్షణ కల్పించడమేంటని న్యాయమూర్తులు భారతీ డాంగ్రే, మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం పేర్కొంది. 19 ఏళ్ల హిందూ యువతిని ప్రభుత్వ షెల్టర్ హోమ్ నుంచి విడుదల చేయాలని కోరతూ 20 ఏళ్ల ముస్లిం యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది. పిటిషన్‌తో […]
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!