Bomb Threat: కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి, ఏం లేదని తేల్చారు. న్యూఢిల్లీ ఏరియాలోని నార్త్ బ్లాక్ పోలీస్ కంట్రోల్ రూంకు బెదిరింపు మెయిల్ వచ్చింది. హోంశాఖ భవనం వద్దకు రెండు ఫైర్ ఇంజన్లను పంపించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియంత్రణలో ఉన్న హోం మంత్రిత్వ శాఖను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో హోం శాఖ కొలువుదీరిన నార్త్ బ్లాక్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే అనుమానాస్పదమైంది ఏదీ కనిపించలేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెదిరింపు మెయిల్ గురించి పోలీసులకు సమాచారం అందింది.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
Read Also: Priyanka Chopra : వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లేస్ ధర అన్ని కోట్లా?
ఇటీవల వరసగా దేశంలోని పలు నగరాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని దాదాపు 150 స్కూళ్లకు ఇలాగే బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు మోయిల్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాఠశాల ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చామని మెయిల్‌లో పేర్కొనడంతో, స్కూల్ యాజమాన్యాలు పిల్లల్ని ఇళ్లకు పంపించారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు త్వరలోనే హంగేరి పోలీసుల్ని సంప్రదిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత జైపూర్, ఢిల్లీ సహా పలు నగరాల్లోని ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. అహ్మదాబాద్ లోని పలు స్కూళ్లు కూడా ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నాయి.
#WATCH | A bomb threat mail was received from the Police Control Room at the North Block, New Delhi area. Two fire tenders have been sent to the spot. Further details awaited: Delhi Fire Service pic.twitter.com/LG4GpZ0cgS
— ANI (@ANI) May 22, 2024
తాజావార్తలు
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!