Kim Jong-Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంతగా పిలుచుకునే కిమ్ జోంగ్ ఉన్‌ని పొగుడుతూ కంపోజ్ చేసిన మ్యూజిక్ వీడియోను దక్షిణ కొరియా నిషేధించింది. ఈ సాంగ్ టిక్‌టాక్‌లో ఏప్రిల్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా ప్రజాదరణ పొందింది. ఈ వైరల్ క్లిప్ దక్షిణ కొరియా జాతీయ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిందని సియోల్ మీడియా రెగ్యలేటర్ తెలిపింది. ‘‘ఫ్రెండ్లీ ఫాదర్’’ పాటకు క్యాచీ ట్యూన్, టెంపో శత్రువైన దక్షిణ కొరియా యువతను కూడా ఆకట్టుకుంది. ఈ వీడియో సాంగ్‌లో కిమ్‌ని ‘తండ్రి’గా, ‘దిగ్రేట్’ అని పొగుడుతోంది. గతంలో కిమ్ తాతా కిమ్ ఇల్ సంగ్ కోసం కూడా ఇవే పదాలను ఉపయోగించారు.
Read Also: Prashant Kishor: బీజేపీ 370 సీట్లు దాటదు, కానీ.. పీకే ప్రిడిక్షన్..
ముఖ్యంగా ఉత్తర కొరియా మీడియా, వెబ్సైట్ల యాక్సెస్ నిరోధించడం ద్వారా కిమ్ జోంగ్ ఉన్ పాలనలో గురించిన ప్రచారాన్ని బహిర్గతం చేయడాన్ని దక్షిణ కొరియా జాతీయ భద్రతా చట్టం పరిమితం చేస్తుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొరియా కమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ కమీషన్, ఈ పాటని దక్షిణ కొరియాపై మానసిక యుద్ధంగా అభివర్ణించింది. మరోవైపు ఈ వీడియోపై నిషేధం విధించడం దక్షిణ కొరయన్లలో మరింత ఆసక్తిని పెంచింది. కొంత మంది వినియోగదారులు ఈ సాంగ్ అందుబాటులో ఉండాలని, ఎందుకంటే జోక్స్‌ని ఆస్వాదించగలమని సెటైర్లు వేస్తున్నారు. కొంతమంటి టిక్‌టాక్ యూజర్లు తాము హోంవర్క్, జిమ్ చేస్తున్న సమయంలో దృష్టిని కేంద్రీకరించేందుకు ఈ సాంగ్ సహకరిస్తుందని చెప్పారు. మరికొందరు ఈ పాటలోని రెట్రో వైబ్స్ ఆస్వాదించామని అన్నారు.