Venu Goapl Reddy
Author- NTV Telugu-
Tata Motors: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దారిలో టాటా మోటార్స్.. జనవరి నుంచి ధరలు పెంపు..
Tata Motors: భారత ఆటోమేకర్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుందాయ్, మారుతీ సుజుకీ దారినే అనుసరిస్తోంది. తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమలులోకి వస్తాయని చెప్పింది. తాజా ప్రకటన ప్రకారం.. తన మోడల్, వేరియంట్ల ఆధారంగా 3 శాతం వరకు పెంచనున్నారు. పెట్రోల్, డిజిల్ వాహనాల(ఐసీఈ)తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వాహనాలకు ధరల పెరుగుదల వర్తిస్తుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ధరల్ని పెంచుతున్నట్లు చెప్పింది. -
Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
Supreme Court: ‘‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’’కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఈ పిటిషన్ పరిష్కరించే వరకు కొత్తగా ఎలాంటి పిటిషన్లు స్వీకరించొద్దని సూచించింది. మందిర్-మసీద్ వివాదాల్లో ఎలాంటి సర్వేలను అనుమతించమని చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులు మతపరమైన స్వభావాన్ని నిర్ణయించేందుకు ఎలాంటి ఆదేశాలు, సర్వేలు జారీ చేయవద్దని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..
Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్‌లోని న్యాయమూర్తుల విభా కంకన్వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది. -
Bashar al-Assad: సిరియా నుంచి బషర్ అల్ అస్సాద్‌ని రక్షించిన రష్యా సీక్రెట్ ప్లాన్..
Bashar al-Assad: సిరియాలో బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 5 దశాబ్ధాలుగా ఆ దేశంలో అస్సాద్ కుటుంబ పాలన ముగిసింది. ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) తిరుగుబాటుదారులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 15 ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇదిలా ఉంటే, బషర్ ఫ్యామిలీలో సహా అతను కూడా రష్యాకు పారిపోయాడు. ఇన్నాళ్లు బషర్కి అండగా ఉన్న ఇరాన్, రష్యాలు తిరుగుబాటుదారుల ముందు తలవంచాయి. -
Parliament: పార్లమెంట్లో ఏం జరగబోతోంది..? ఎంపీలకు ‘‘ త్రీ లైన్ విప్’’ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
Parliament: ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు’’కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది. -
LAC Border truce: చైనా ఫారెన్ మినిస్టర్‌తో భేటీ కానున్న అజిత్ దోవల్.. సరిహద్దులపై చర్చ..
LAC Border truce: 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్-చైనా సరిహద్దుల వెంబడి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇటీవల ‘‘లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ)’’ వెంబడి దీర్ఘకాలంగా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్, చైనాలు సరిహద్దు సంధిని కుదుర్చుకున్నాయి. లఢక్ ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం వెనక్కి వెళ్లేందుకు అంగీకరించాయి. -
NIA: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 5 రాష్ట్రాల్లో 19 చోట్ల ఎన్ఐఏ దాడులు..
NIA: నిషేధిత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైష్ ఏ మహ్మద్(జేఈఎం)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతుగా ప్రచారానికి పాల్పడుతున్నారని.. అస్సాం, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లోని 19 చోట్ల దాడులు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని బామ్జూ మట్టన్ ప్రాంతం, బారాముల్లాలోని క్రీరీ, బుద్గామ్‌లోని ఖాన్ సాహిబ్ ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. -
Bengaluru Techie Suicide: అర్ధరాత్రి ఇంటి నుంచి పరారైన అతుల్ సుభాష్ భార్య కుటుంబం..
Bengaluru Techie Suicide: బెంగుళూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో భార్య నికితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
One Nation One Election: ‘‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు’’కు కేంద్ర కేబినెట్ ఆమోదం…
One Nation One Election: ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభ ఎన్నికల కోసం ఉద్దేశించించబడిన ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’’కి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
Pushpa 2: దొంగలు కూడా ‘‘తగ్గేదే లే’’.. పుష్ప 2 సినిమా హాలులో దోపిడి..
Pushpa 2: పుష్ప-2 కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ. 1000 కోట్ల మార్క్‌ని దాటేసింది. ఉత్తరాదిని పుష్ప మానియా మామూలుగా లేదు. నార్త్ ఇండియాలో థియేటర్లు హౌజ్ ఫుల్ కలెక్షన్లను సాధిస్తున్నాయి. ఇందుకేనేమో దొంగలు థియేటర్లను టార్గెట్ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ బిలాయ్ నగరంలో ‘‘పుష్ప 2: ది రూల్’’ సినిమాని ప్రదర్శిస్తున్న థియేటర్లో దోపిడి జరిగింది.
తాజావార్తలు
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!