Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధాలను రహస్యంగా పరీక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని పాకిస్తాన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం కాదు. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని అన్నారు.
Shocking: అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చ పెడుతున్నాయి. ముఖ్యంగా, పెళ్లి అనంతరం వేరే వ్యక్తుల మోజులో పడిన మహిళలు భర్త, పిల్లల్ని వదిలేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఏటావా జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళ తన భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలేసి, ఇన్స్టాగ్రామ్ లవర్‌తో లేచిపోయింది. తన లవర్‌లో జీవించాలని అనుకుంటున్నానని కోర్టులో చెప్పింది. తన భర్త తాగుబోతు, జూదగాడు అని ఆరోపించింది.
Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా లండన్ ఆసుపత్రిలో మరణించారు. 85 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పిలువబడే ఆయన 1950లో కుటుంబ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు.
World Cup: భారత మహిళ క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఓడించింది. అయితే, ఈ విజయం ఎఫెక్ట్‌లో మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం, బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు ఏకంగా 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.
Bengaluru: తన భార్యను పక్కా పథకంలో హత్య చేసిన బెంగళూర్ డాక్టర్ ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత నెలలో నిందితుడైన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నేరం జరిగిన కొన్ని వారాల తర్వాత నిందితులు, పలువురు మహిళకు సంచలన మెసేజ్‌లు పంపించాడు.
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. సోమవారం, ప్రధాని మోడీ ఆర్జేడీ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Bangladesh: గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయ్యారు. అయితే, షేక్ హసీనా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ సంచలన ఆరోపణలు చేశారు. హసీనాను పదవి నుంచి దించడానికి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కూడా సహాయం చేశారని అన్నారు. అమెరికా సీఐఏ ఈ మొత్తం […]
SIR: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీహార్‌లో ఇప్పటికే ఇది వివాదాస్పదం అయింది. నకిలీ ఓటర్లను తీసేస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించేందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఎన్నికల కమిషన్ చేపట్టే ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Air India: శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఆదివారం మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ముందస్తు జాగ్రత్త చర్యగా ల్యాండింగ్ చేసిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. కోల్‌కతా మీదుగా నడుస్తున్న ఈ విమానం AI174 ఉలాన్‌బాతర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుతం, సాంకేతిక తనిఖీలు జరుగుతున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
Pakistan: ‘‘జై శ్రీ రామ్’’ అని మన దేశంలో నినదిస్తే, అందరూ కూడా గొంతు కలుపుతారు. అయితే, పాకిస్తాన్లో ఈ నినాదాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.