Gang Rape: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, ఓ మైనర్ బాలికకు నరకంలా మారింది. ఫ్రెండ్‌గా పరిచమైన వ్యక్తి మాయమాటలతో హోటల్‌కు రప్పించి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు బంధించి, గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) కొనసాగుతున్న సమయంలో, బుర్ద్వాన్ జిల్లాలోని ఒక చెరువులో వందలాది ఆధార్ కార్డులు దొరికాయి.
Jaish-e-Mohammad: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్(జెఎం) తన మహిళా ఉగ్రవాద విభాగాన్ని ప్రారంభించింది. జమాత్-ఉల్-మోమినాత్ అనే మొదటి మహిళా జిహాదీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సయీదా అజార్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించింది.
POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత, మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్-Z నేతృత్వం నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు.
Happiest City: ఆసియాలో ‘‘అత్యంత సంతోషకరమైన నగరం’’గా భారతీయ నగరం నిలిచింది. టైమ్ అవుట్ నిర్వహించిన కొత్త సర్వే ప్రకారం, ముంబై 2025గానూ ఈ టైటిల్‌ను గెలుచుకుంది. పట్టణవాసులు తమ పరిసరాలు, జీవనశైలి, సమాజాల గురించి ఎలా భావిస్తున్నారో అంచనా వేయడానికి ప్రధాన నగరాల్లో 18,000 మందికి పైగా నివాసితులను వార్షిక సర్వే పోల్ చేసింది. కల్చర్, ఆహారం, నైట్ లైఫ్, జీవన నాణ్యతతో సహా అనేక అంశాల ఆధారంగా సర్వేలో పాల్గొన్న వారు తమ నగరాలకు రేటింగ్ ఇచ్చారు.
Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతోంది. అయితే, రాష్ట్రంలోని లఖిసరై జిల్లాలో పోలింగ్ రోజున ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో, ఆవు పేడతో, చెప్పులతో దాడులు చేశారు.
Crime: వెంకటేష్ నటించిన సూపర్ హిట్ ఫిలిం ‘‘దృశ్యం’’ తరహాలో ఒక మర్డర్ జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ తన భర్తను చంపేసి, వంటింటిలో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడు, అతడి స్నేహితుడి సహాయంతో భర్తను చంపేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇంటిలోని వంటగదిలో నేల కింద పూడ్చిపెట్టింది. నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్న తర్వాత అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఘటనా స్థలం నుంచి అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు.
BJP Leader: అమెరికా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు కాబోతున్న మొదటి ముస్లిం మేయర్‌గా మమ్దానీ చరిత్ర సృష్టించారు. దీని తర్వాత, ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము ఏ ఖాన్‌ను ముంబై మేయర్‌గా అనుమతించం’’ అని అన్నారు. ఓట్ జిహాద్ ద్వారా న్యూ్యార్క్ నగరంలో కనిపించే విధంగా ముంబైకి రాజకీయాలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
Pakistan: సిక్కు మత స్థాపకుడు గురునానక్ 556వ జయంతి సందర్భంగా భారత్‌లోని సిక్కు మతస్తులు ఆయన జన్మస్థలం అయిన పాకిస్తాన్ లోని నంకనా సాహిబ్‌కు వెళ్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్‌కు భారతీయులు వెళ్లడం ఇదే తొలిసారి. అయితే, ఇలా వెళ్లే వారిలో 14 మందిని పాకిస్తాన్ అధికారులు ముందుగా వారి దేశంలోకి అనుమతించి, ఆ తర్వాత తిప్పి పంపించారు. ‘‘మీరు సిక్కులు కాదు, హిందువులు’’ అంటూ పాక్ అధికారులు వారి దేశంలోకి అనుమతించలేదు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని అక్కడి ముస్లిం మతం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మత సంస్థల సమాఖ్య అయిన ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU) ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘‘బలవంతపు ఆదేశాలు’’గా అభివర్ణించింది. జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని స్కూళ్లలో విద్యార్థులు, సిబ్బంది సంగీత-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంఘాలు తప్పుపట్టాయి. ఇది అన్యాయమని, ఇస్లాంకు…