Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
- SIR వివాదం వేళ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- ‘ఓటు చోరీ నుంచి చట్టాల చోరీ’ అంటూ తీవ్ర ఆరోపణలు
- బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదని ప్రశ్న
- జ్ఞానేశ్ కుమార్‌ను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నియామకం, ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాలో మార్పులపై ఆయన పలు ప్రశ్నల్ని లేవనెత్తారు. దేశంలో ఓటు హక్కును దొంగిలిస్తున్నారని ఆరోపించారు. ఇది ఓటుపై దాడి మాత్రమే కాదని, ప్రతీ భారతీయుడి ప్రజాస్వామ్య భావప్రకటనా హక్కుపై దాడి, దేశ రాజ్యంగంపై దాడి అని అన్నారు. తాను గత మూడేళ్లుగా ఈ ప్రశ్నల్ని లెవనెత్తుతున్నానని, తన వాదనలకు మద్దతుగా హర్యానా, మహరాష్ట్ర, కర్ణాటక నుంచి ఆధారాలనున ఉదహరించానని అన్నారు.
ఇందిరాగాంధీ ఓడిపోయారు, బీజేపీ ఎందుకు ఓడటం లేదు..?
ప్రజాస్వామ్య దేశాల్లో, దీర్ఘకాలం పాటు అధికారంలో ఉండే ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంటుందని అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంతో ఇందిరాగాంధీ ప్రజాదరణ పీక్స్‌కు చేరిందని, కానీ ఒకటి రెండు ఏళ్లలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలకు ఇలా జరిగితే, నరేంద్రమోడీ, అమిత్ షా, బీజేపీలకు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ప్రజాదరణను లేదా ప్రభుత్వ పనితీరును తాను అర్థం చేసుకోగలనని, కానీ ప్రభుత్వ వ్యతిరేక అకస్మత్తుగా ఎలా మాయమైందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని అన్నారు.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
ఓటును ధ్వంసం చేశారు.
భారతీయుడు ఓటు హక్కు వినియోగించుకుంటే, దాని బలాన్ని రాజ్యాంగంలో నిక్షిప్తం చేస్తాడని రాహుల్ గాంధీ అన్నారు. ఓటు హక్కు రాజ్యాంగానికి అధికారాన్ని ఇస్తుంది, రాజ్యాంగం నుంచే చట్టాలు రూపొందుతాయి, చట్టసభల సభ్యులు ఓట్ల ద్వారానే ఎన్నికవుతారని అన్నారు. ఓటింగ్‌ను రద్దు చేస్తే రాజ్యాంగం అర్థరహితం అవుతుందని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ సంస్థలన్నీ ప్రశ్నార్థకంగా మారుతాయని అన్నారు. దేశంలో ఓటు దొంగతనం, ఓటు ధ్వంసం చేశారని ఆరోపించారు.
2024 ఎన్నికలు రిగ్గింగ్..
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఎలా నియమించారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక ప్రక్రియ కార్యనిర్వహక ప్రభావం నుంచి దూరంగా ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి జ్ఞానేష్ కుమార్‌ను ఎంపిక చేశారని అన్నారు. ఈ ప్రక్రియ సరిగా లేదని, స్వతంత్రంగా లేదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వా్మ్యంపై ఇలా దాడి జరగలేదని, 2024 లోక్‌సభ , అసెంబ్లీ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!