Tata Sierra: టాటా మోటార్స్(Tata Motors) సియెర్రా SUVని తీసుకురాబోతోంది. నవంబర్ 25న ఈ కార్ని లాంచ్ చేయబోతున్నారు. సియోర్రా టీజర్‌ను టాటా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఎస్యూవీ ఎక్స్‌టీరియర్స్‌తో పాటు ఇంటీరియర్‌ను పరిచయం చేసింది. టాటా మోటార్స్ గత వాహనాలతో పోలిస్తే సియెర్రా మరింత స్టైలిష్ లుక్స్‌తో వస్తోంది. ఇంటీరియర్, డాష్‌బోర్డులు కొత్తగా కనిపిస్తున్నాయి. 3-స్రీన్ లేవుట్ స్పష్టంగా కనిపిస్తోంది. సర్రూఫ్తో స్టైలిష్ లుక్స్ కలిగి ఉంది.
Pakistan: పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ తన కొత్త పుస్తకంలో 26/11 ముంబై దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో శాంతిగా ఉండేందుకు జర్దారీ అంగీకరించడం, అణ్వాయుధాలపై ‘‘నో ఫస్ట్ యూజ్’’ అనే విధానాన్ని ప్రతిపాదించినందుకే దాడులు జరిగినట్లు చెప్పారు. 'ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్'లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బాబర్ ఈ విషయాలు తెలిపారు. జర్దారీ శాంతి ప్రతిపాదన పాకిస్తాన్…
Bihar elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ కు ఒక రోజు ముందు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి బీజేపీలో చేరారు. గురువారం బీహార్‌లో మొదటి విడుత ఓటింగ్ జరబోతోంది. దీనికి ఒక్క రోజు ముందే ప్రశాంత్ కిషోర్‌కు ఆయన పార్టీ అభ్యర్థి ఝలక్ ఇచ్చారు. ముంగేర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తు సంజయ్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుని, ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చారు.
BrahMos missile: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొనుగోలుకు సంబంధించి భారత్-ఇండోనేషియా మధ్య ప్రధాన రక్షణ ఒప్పందాలను ఖరారు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రష్యా నుంచి తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య వివిధ స్థాయిల్లో చర్చలు జరిగాయి.
Rajnath Singh: భారతదేశంలోని 10 శాతం మంది సైన్యాన్ని నియంత్రిస్తున్నారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, అగ్రకులాలే సైన్యాన్ని నియంత్రిస్తున్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Election Commission: హర్యానాలో ఓట్ల దొంగతనం జరిగినట్లు రాహుల్ గాంధీ బుధవారం భారత ఎన్నికల కమిషన్(ECI) తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. కాంగ్రెస్ నేత ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్(SIR) కు మద్దతు ఇస్తున్నారా.? లేక వ్యతిరేకిస్తున్నారా.? అని ప్రశ్నించింది. సర్ ద్వారా ఈసీ నకిలీ, చనిపోయిన, వేరే ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను తొలగిస్తుంది. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా జరిగిందని అన్నారు.
Laika sacrifice: ఇప్పుడంటే, ప్రతీ దేశం తమ వ్యోమగాముల్ని అంతరిక్షానికి పంపాలని అనుకుంటోంది. అమెరికా, రష్యా, యూరప్ దేశాలు ఎంతో సులభంగా తమ వ్యోమగాముల్ని అంతరిక్షానికి పంపుతున్నారు. మళ్లీ వారిని సేఫ్‌గా భూమి పైకి తీసుకువస్తున్నారు. 68 ఏళ్ల క్రితం ఒక చిన్న వీధి కుక్క లేకపోతే, దాని త్యాగం లేకుంటే మానవుడు అంతరిక్షానికి వెళ్లే సాహసం చేసే వాడా..?, ‘‘లైకా’’ అనే కుక్క అంతరిక్షంలో తన ప్రాణాలను త్యాగం చేసి, మానవుడికి అంతరిక్షాన్ని దగ్గర చేసింది.
Digvijaya Singh: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ గురించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఉమర్ ఖలీద్ ‘‘నిర్దోషి, అమాయకుడు’’ అంటూ ఆయన అనడం కొత్త వివాదాన్ని రేపింది. జాతీయ భద్రతలకు ఆందోళన కలిగించే తీవ్రమైన కేసుల్లో ఉన్న వ్యక్తి పట్ల దిగ్విజయ్ సింగ్ సానుభూతి చూపిస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడి చేసింది. దిగ్విజయ్ సింగ్ తన సోషల్ మీడియా పోస్టులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలీద్ ఐదేళ్లుగా నిర్బంధంలో ఉన్నప్పటికీ న్యాయం దక్కడం…
Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి మతోన్మాదుల చేతిలో పావుగా మారిపోయాడు. జమాతే ఇస్లామి వంటి సంస్థలతో అంటకాగుతూ, బంగ్లా వ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్నాడు. తాజాగా, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్, పీఈటీ టీచర్ల పోస్టుల్ని రద్దు చేశారు. Read Also: Speaker […]
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సైన్యం దేశ జనాభాలో 10 శాతం మంది (అగ్రకులాలను సూచిస్తూ) నియంత్రణలో ఉందని మంగళవారం అన్నారు. బీహార్ ఔరంగబాద్‌లో ప్రచారం చేస్తూ.. దేశ జనాభాలో 10 శాతం మందికి కార్పొరేట్ రంగాలు, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థలో అవకాశాలు లభిస్తున్నాయి, సైన్యం కూడా వారి నియంత్రణలో ఉంది అని అన్నారు. మిగిలిన 90 శాతం, వెనుకబడిన తరగతులు, దళితులు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర మైనారిటీలు ఎక్కడా కనిపించడం లేదని…