Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
- ఉక్రెయిన్ వార్‌లో తేలిపోతున్న పాకిస్తాన్ మందుగుండు..
- సరిగా పనిచేయడం లేదని చెబుతున్న ఉక్రెయిన్ కమాండర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో పాకిస్తానీ మందుగుండు సామాగ్రి తుస్సుమంటోంది. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారీలకు చెందిన 155mm మందుగుండు సామగ్రిలో నాణ్యతా సమస్యలు ఉన్నాయని ఒక ఉక్రేనియన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కమాండర్ ఫిర్యాదు చేశారు. కొన్ని బ్యాచుల్లో నాణ్యతా సమస్యలు బయటపడ్డినట్లు వెల్లడించారు. దీని వల్ల ఫిరంగి బృందాలు వేర్వేరు తయారీదారులకు సంబంధించిన వేర్వేరు బాలిస్టిక్ డేటా ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితులు యుద్ధభూమిలో ఖచ్చితత్వం, సామర్థ్యంపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో తయారైన M107 155mm షెల్స్‌ను ఉక్రెయిన్ రష్యాకు వ్యతిరేకంగా వాడుతోంది.
వివిధ తయారీదారులకు వివిధ బాలిస్టిక్ పట్టికలు ఉపయోగించాల్సి వస్తోందని, దీని వల్ల ఫైరింగ్ ముందు సిద్ధం కావడానికి అదనపు సమయం పట్టడంతో పాటు పొరపాటు అవకాశాలు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో పాకిస్తాన్ నుంచి మందుగుండు సామాగ్రి ఎగుమతి అవుతోంది. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ చాలా కాలంగా మందుగుండును పెద్ద ఎత్తున సరఫరా చేస్తోందని యూఎస్ ఒప్పందాలు సూచిస్తున్నాయి.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ఇదిలా ఉంటే, ఈ వ్యాఖ్యలకు 1965 నాటి యుద్ధాన్ని జత చేస్తున్నారు. ఆ యుద్ధంలో జైసల్మేర్‌లోని తానోట్ ప్రాంతంలో పాకిస్తానీలు ప్రయోగించిన కొన్ని షెల్స్ పేలలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. ఉక్రెయిన్ 7వ ఆర్టిలరీ బ్రిగేడ్ కమాండర్ విటాలి కొర్నియెంకో ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!